Wednesday, May 6, 2026 10:53 PM
Wednesday, May 6, 2026 10:53 PM

మోడీ నాకు మంచి ఫ్రెండ్.. భారత్ వెళ్తాను: ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి కాస్త భారత్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాను అడ్డం పెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెడుతున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే భారతీయులకు వీసాలను జారీ చేసే విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి కూడా వివాదాస్పదం అవుతోన్న సంగతి తెలిసిందే. పదే పదే భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇదే సమయంలో పాక్ తో మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నాయి.

Also Read : అంతా నా ఇష్టం.. మారని కొలికపూడి వైఖరి

ఈ తరుణంలో తాజాగా ఓ వార్త ఆసక్తికరంగా మారింది. ట్రంప్ భారత పర్యటనకు రానున్నట్టు వెల్లడి అయింది. తాజాగా వైట్ హౌస్ లో విలేఖర్లతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రసంశలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని, గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. తనకు మోడీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ట్రంప్. ఈ సందర్భంగా రష్యా వద్ద ముడి చమురు కొనుగోలుపై ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేసింది అన్నారు.

Also Read : ప్రశాంత్ వర్మపై నిర్మాతల ఆగ్రహం – వంద కోట్ల అడ్వాన్స్ వివాదం?

మోడీ తనకు స్నేహితుడు అని, తాము కూడా మాట్లాడుకుంటాం అని అన్నారు. మోడీ తనను భారత్ రావాలని ఆహ్వానిస్తున్నారని, తాను కూడా వెళ్ళే అవకాశం ఉందన్నారు. సుంకాల సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్ వెళ్తారా అని అడగగా.. అవును వెళ్ళవచ్చు అని కామెంట్ చేసారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను సందర్శించే అవకాశం లేదని.. అక్కడి మీడియా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా తాను భారత్ వెళ్తాను అంటూ ట్రంప్ ప్రకటించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్