Sunday, June 21, 2026 07:42 AM
Sunday, June 21, 2026 07:42 AM

టి20 ప్రపంచ కప్ డేట్స్ ఇవే.. పాక్ మ్యాచ్ లు అక్కడే..!

భారత్ లో మరో మెగా టోర్నీకి రంగం సిద్దం కానుంది. పొట్టి ఫార్మాట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ టి20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు కరేబియన్ దీవుల్లో జరిగిన టోర్నీలో ఉత్కంట విజయంతో జగజ్జేతగా నిలిచింది. ఇక వచ్చే వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై కొన్నాళ్ళుగా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా కీలక ప్రకటన వెలువడింది.

Also Read : శ్రీచరణికి ఘన స్వాగతం.. ఇంటి బయటకు వచ్చిన లోకేష్ స్వాగతం..!

తాజాగా టోర్నీ నిర్వహించే తేదీలను కూడా ఐసీసీ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి20 ప్రపంచకప్ ను నిర్వహిస్తారు. టి20 ప్రపంచకప్ కు భారత్ తో పాటుగా శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. భారత్ లో 5, శ్రీలంకలో 2 స్టేడియంలలో మ్యాచ్ లను ఐసీసీ నిర్వహిస్తుంది. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై లలో మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఇక శ్రీలంకలో కొలంబో, కాండీలో మ్యాచ్ లు జరుగుతాయి.

Also Read : ప్రచారానికి ఆ ముగ్గురు దూరం.. కారణాలేమిటో..?

ఇదే సమయంలో పాకిస్తాన్ విషయంలో ఐసీసీ పలు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీలంకలో తన మ్యాచ్ లను పాకిస్తాన్ ఆడనుంది. పాకిస్థాన్ ఫైనల్ కు వెళితే మాత్రం శ్రీలంకకు వేదికను మార్చే అవకాశం ఉంది. మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్ వచ్చే వారం విడుదల చేయనున్న ఐసీసీ… ఒకే గ్రూప్ లో దాయాదులను ఉంచుతుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఇటీవల ఆసియా కప్ సందర్భంగా పాక్ వైఖరి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీని భారత్ కు ఆసియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్వీ అందించలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్