Sunday, June 21, 2026 11:11 AM
Sunday, June 21, 2026 11:11 AM

శ్రీచరణికి ఘన స్వాగతం.. ఇంటి బయటకు వచ్చిన లోకేష్ స్వాగతం..!

భారత మహిళా క్రికెటర్లకు దేశ వ్యాప్తంగా ఘన స్వాగతం లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు వారికి అభినందనలు తెలుపుతూ తమ వంతు ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏపీ సిఎం చంద్రబాబు మహిళా క్రికెటర్ శ్రీ చరణీ రెడ్డిని కలిసారు. క్రీడాకారులను ప్రోత్సహించే సిఎం ఆదేశాలతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. కాసేపటి క్రితం సీఎం క్యాంప్ కార్యాలయానికి శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ చేరుకోగా వారిని సిఎం అభినందించారు.

Also Read : ప్రచారానికి ఆ ముగ్గురు దూరం.. కారణాలేమిటో..?

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్.. ఇంటి బయటకు వచ్చి ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. శ్రీచరణి, మిథాలి రాజ్‌లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ తో శ్రీచరణి పంచుకుంది. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు.

Also Read : అలా అయితే థియేటర్లు ఖాళీ..!

ఇదిలా ఉంటే.. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీచరణి, మిథాలీ రాజ్‌ ను వెంటపెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ చేరుకున్నారు. కాగా ఆమెకు ఏపీ సర్కార్ ఉద్యోగంతో పాటుగా నగదు ప్రోత్సాహం అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్