పార్టీ చెప్పింది.. నేను చేశాను.. నాకేం తెలియదు.. నేనేం చేయలేదు.. ఇది వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కర్నూలు పోలీసులకు ఇచ్చిన సమాధానం. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఆ ప్రమాదంపై శ్యామల మీడియా ముందుకు వచ్చి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి ప్రభుత్వమే కారణమన్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని.. అందుకే అర్థరాత్రి సమయంలో కూడా మద్యం సేవించి బైక్ నడిపారని.. అందుకే హైవే మీద ప్రమాదానికి గురయ్యారని శ్యామల పదే పదే ఆరోపించారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు.
Also Read : ఒక్క మగాడు ఎలివేషన్.. పిచ్చి పీక్స్..!
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 19 సజీవ దహనం అయ్యారు. రహదారిపై పడిపోయిన బైక్ పై నుంచి వేగంగా బస్సు వెళ్లడంతో.. పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి.. మంటలు చెలరేగాయి. దీంతో వల్ల బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారని.. అందులో 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు తొలి నుంచి రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమన్నారు. అలాగే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని.. దాని వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఇదే ఆరోపణలు చేశారు. కేవలం ప్రభుత్వం అవినీతి, బెల్ట్ షాపుల కారణంగానే ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు.. దర్యాప్తులో భాగంగా శ్యామలను విచారించారు. బెల్ట్ షాపులో మద్యం సేవించినట్లు మీకెలా తెలుసు అని ప్రశ్నించారు. దీనిపై శ్యామల చెప్పిన సమాధానం ఇప్పుడు వైసీపీ నేతలను ఇరుకున పెట్టింది. వైసీపీ పెద్దల నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే తాను చదివినట్లు శ్యామల పోలీసులకు తెలిపారు. అసలు ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో తనకెలా తెలుస్తుందని కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు వైసీపీ పెద్దలు ఇచ్చిన మ్యాటర్ మాత్రమే తాను చదివినట్లు స్పష్టం చేశారు.
Also Read : గోవాలో కల్తీ మద్యం.. అద్దేపల్లి లిక్కర్ దందా..!
“పార్టీ చెప్పింది. కాబట్టే నేను మాట్లాడాను..” అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలను పార్టీ పెద్దలు తప్పుబడుతున్నారు. ఇన్ని రోజులు శ్యామల ప్రెస్ ముందు చెప్పిందంతా పార్టీ రాసింది చదవటమే.. అనే నిజం ఇప్పుడు బయటకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు చెప్పిన శ్యామల.. బయటకు వచ్చిన తర్వాత.. నేను వైసీపీ అధికార ప్రతినిధిని… పది ప్రశ్నలు అడిగాను.. వాటికి టీడీపీ నేతలు జవాబు చెప్పాలి.. అంతే కానీ ఇలా పోలీసు కేసులు పెడతారా అని పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. నిజానికి ఆమె వేసిన ప్రశ్నలన్నీ పార్టీ పెద్దలు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అనే విషయం స్వయంగా ఒప్పుకున్నారు శ్యామల. అయినా సరే.. నేను ప్రశ్నిస్తా.. సమాధానం చెప్పాల్సిందే అని బుకాయిస్తున్నారేమిటన వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కెమేరా ముందు నటించే వాళ్లతో ఇదే ఇబ్బంది అంటూ కొందరు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. శ్యామల స్క్రిప్ట్ బయటపడింది. యాక్టింగ్ రియల్‌గా మారిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

