Thursday, May 7, 2026 07:00 AM
Thursday, May 7, 2026 07:00 AM

కాంగ్రెస్ కోటలో జూబ్లీహిల్స్ గుబులు..!

తెలంగాణలో ప్రస్తుతం ఒకటే హాట్ టాపిక్. అదే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఇక జంట నగరాల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. ఇక బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండటంతో జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : ఒక్క మగాడు ఎలివేషన్.. పిచ్చి పీక్స్..!

కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిఫరెండం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచినా, ఓడినా.. ఆ పార్టీకి నష్టం లేదంటున్నారు గులాబీ పార్టీ నేతలు. కానీ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం.. ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే.. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని.. అదే కాంగ్రెస్ ఓడితే మాత్రం.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదు కాబట్టే.. ప్రజలు ఓడించారని కనువిప్పు కలుగుతుందంటున్నారు.

మరో విషయం కూడా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే హడావుడిగా అజారుద్దీన్‌ను మంత్రిని చేశారని.. కానీ రెండేళ్ల పాటు మంత్రివర్గంలోకి మైనారిటీని ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఎన్నికల్లో గెలుపు కోసమే ఇప్పుడు మైనారిటీ కార్డు వాడుతున్నారని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు సైలెంట్ అయ్యారు. టికెట్ ఆశించిన నేతలంతా ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో నవీన్ గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా నెత్తికెత్తుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించిన రేవంత్.. ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు.

Also Read : లిక్కర్ స్కాం లో కొత్త పేరు.. అరెస్ట్ చేస్తారా..?

జూబ్లీహిల్స్‌ పరిధిలో ఎన్టీఆర్, పీజేఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని.. కాబట్టి వారి కోసం ఇద్దరు నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సినీ పరిశ్రమ కార్మికులను ఆకట్టుకునేందుకు లాభాల్లో వాటా అని ప్రకటించారు కూడా. కానీ ఇవేవీ ఆశించిన ఫలితాలు రాబట్టేలా లేవని సర్వే సంస్థలు ఇప్పటికే చెబుతున్నాయి. ఇక కులం కార్డు కూడా కాంగ్రెస్‌కు కలిసి రావడం లేదనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. కేవలం యాదవ సామాజిక వర్గాన్ని మాత్రమే నవీన్ చేరదీస్తున్నారని.. దీని వల్ల ఇతర బీసీ నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక దగ్గరపడుతున్నకొద్ది.. కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు మొదలైందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్