Saturday, September 19, 2026 10:20 PM
Saturday, September 19, 2026 10:20 PM

గుడ్ న్యూస్: ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు..?

సాధారణంగా ప్రయాణాలకు సంబంధించిన టికెట్ లు చాలా మంది ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో బుక్ చేసుకున్న టికెట్ లను రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో అదనపు చార్జీల కారణంగా ప్రయాణికులు కొంత నగదు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చార్జీలు ఎక్కువగా పడకుండా చర్యలు చేపట్టింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

Also Read : ఒక్క మగాడు ఎలివేషన్.. పిచ్చి పీక్స్..!

విమాన టిక్కెట్ బుకింగ్ కు సంబంధించి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలను అందించే ఏర్పాటు చేస్తోంది. ఇది అమలులోకి వస్తే విమాన ప్రయాణీకులు అదనపు ఛార్జీలు లేకుండా బుకింగ్ చేసిన 48 గంటల్లోపు వారి టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చు, లేదా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. విమాన టికెట్ రీఫండ్‌ కు సంబంధించిన సమస్యలపై ఆందోళన వ్యక్తమవుతోన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. బుకింగ్ చేసిన 24 గంటల్లోపు ప్రయాణీకుడు ఏవైనా సమస్యలు ఉంటే.. వాటిని ఏ చార్జీలు లేకుండా మార్చుకోవచ్చు.

Also Read : బ్రేకింగ్: కెనడా సంచలన నిర్ణయం.. టూరిస్ట్ వీసాలు రద్దు..?

ఒక విమానయాన సంస్థ టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు ప్రయాణీకులకు ‘లుక్-ఇన్ ఆప్షన్’ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాలంలో, ప్రయాణీకులు టికెట్‌ లో మార్పులు చేయాలి అనుకుంటే.. విమాన ప్రయాణానికి ఉండే సాధారణ చార్జీలు మినహా ఏ విధమైన అదనపు చార్జీలు ఉండరాదు. అంతేకాకుండా, బుకింగ్ తేదీ నుండి దేశీయ విమానాలకు 5 రోజుల కంటే తక్కువ, అంతర్జాతీయ విమానాలకు 15 రోజుల కంటే తక్కువ సమయం ఉన్న విమానాలకు ఈ సౌకర్యం వర్తించదని కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంలో టికెట్‌ ను నేరుగా ఎయిర్‌ లైన్ వెబ్‌ సైట్ ద్వారా బుక్ చేసుకుంటారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్