Wednesday, February 4, 2026 09:44 PM
Wednesday, February 4, 2026 09:44 PM

అన్న.. ఎటు వెళ్లాలి.. ఎవర్ని కలవాలి..?

అన్న.. ఎటు వెళ్లాలి.. ఎవర్ని కలవాలి..? ఇదే ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న ప్రశ్న. ఇంతకీ ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారనే కదా మీ అనుమానం.. ఎవరో కాదు.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు తమ పార్టీ కార్యాలయంలోకి ఎలా వెళ్లాలి.. అక్కడ ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలి అనే విషయం అర్థం కావటం లేదంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం కంటే.. తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకోవటం చాలా సులభం అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు ఏకైక కారణం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కేవలం ఓ పది మందికి మాత్రమే పరిమితమైందనే ఆరోపణలే.

Also Read : బస్సు బూడిదలో బంగారం కోసం వేట.. కర్నూలులో నివ్వెరపరిచే దృశ్యాలు

వైసీపీ అంటే తొలి నుంచి ఒక అభిప్రాయం ఉంది. పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా సరే.. కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే ఆ పార్టీకి కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా మంచి పేరు ఉంటుంది. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన.. ఏ పార్టీ అయినా సరే.. కార్యకర్తల బాగు కోసమే పని చేస్తాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. అందులోకి ఎవరైనా నేరుగా వెళ్లొచ్చు. చంద్రబాబు, లోకేష్ అందుబాటులో లేకపోయినా సరే.. ఇతర నేతలు అక్కడ ఉంటారు. వారికి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడలో ఉంది. అక్కడికి కూడా ఎవరైనా వెళ్లొచ్చు. మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు.

కానీ వైసీపీలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లిలోని ఓ అద్దె భవనంలో నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అద్దె చెల్లించడం దండగ అని భావించిన వైసీపీ పెద్దలు.. ఆ భవనాన్ని ఖాళీ చేసి తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఓ వైపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇలా చేసిన నాటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇక్కట్లు మొదలయ్యాయి. అప్పటి వరకు పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన నేతలు.. తాడేపల్లి ప్యాలెస్‌లోకి మార్చిన తర్వాత నుంచి అందులోకి వెళ్లడం కష్టంగా మారిందంటున్నారు. గతంలో తాడేపల్లిలో కార్యాలయం ఉన్నప్పుడు నాటి పార్టీ నేతలు విజయ సాయిరెడ్డితో పాటు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ వంటి నేతలు ఎవరో ఒకరు అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు పరస్థితి పూర్తిగా మారిపోయింది.

Also Read : మెగా ఫ్యామిలీకి పోటీగా మహేష్ ఫ్యామిలీ

తాడేపల్లి కార్యాలయానికి పార్టీ అధినేత జగన్ 2 రోజులు వస్తున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం వచ్చి.. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఆ రోజుల్లో పార్టీ కార్యాలయంలోకి ఎవరికీ అనుమతి లేదు. ఎవరైనా నేరుగా అధినేతకు తమ సమస్యలు చెప్పుకోవాలంటే.. ముందు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యే, సమన్వయకర్త అనుమతి తప్పనిసరి. అలా అనుమతి లేకపోతే.. ఆఫీసులోకి నో ఎంట్రీ. ఇక జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు అయితే.. తాడేపల్లి ఆఫీసులో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదు. దూర ప్రాంతాల నుంచి తాడేపల్లికి వచ్చిన కార్యకర్తలకు గేటు బయటే నిరాశ ఎదురవుతోంది. “లోవల ఎవరూ లేరన్నా.. నీ అర్జీని ఇక్కడే ఇచ్చేసి వెళ్లు..” అని రిసెప్షన్ సిబ్బంది చెబుతున్నారు. ఇలా ఇచ్చిన ఫిర్యాదులు అధినేత వరకు చేరటం లేదనేది కార్యకర్తల ఆరోపణ. దీంతో కార్యాలయానికి ఎటు వెళ్లాలి.. ఎవర్ని కలవాలి అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేత మీద ఫిర్యాదు చేయాలన్నా సరే.. ఆ నేత అనుమతి కావాలా అని వైసీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్