ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకిన మోంథా తుఫాన్ దెబ్బకు రైతన్నలు విలవిలాడిపోయారు. తుఫాను విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో ప్రాణా నష్టం తప్పినా.. రైతన్నలు నిండా మునిగిపోయారు. ముఖ్యంగా దివిసీమ ప్రాంతంతో పాటుగా, ఉమ్మడి ఉపయోగ గోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో వారం రోజుల్లో కోతకు వచ్చే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు, అరటి సహా పలు ఉద్యానవన పంటలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
Also Read : అజారుద్దీన్ కు ఎన్నికల సంఘం షాక్ ఇస్తుందా..? బీజేపీ సంచలనం..!
తాజాగా పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించి రైతులకు జరిగిన నష్టాన్ని స్వయంగా చూశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. వరి చేతికి వచ్చే సమయంలో.. నీట మునిగిపోవడంతో ధాన్యం కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటు నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి. తెలంగాణలో నిన్న కురిసిన భారీ వర్షాలకు మున్నేరు నది పొంగుతోంది. దీనితో జగ్గయ్యపేట నియోజకవర్గంలో నది పరివాహక ప్రాంతంలోని వరి, పత్తి పంటలు తీవ్రంగా పాడైపోయాయి. నిన్న కురిసిన వర్షంతో చేతికి వచ్చిన పత్తి తడిచిపోయింది.
Also Read : వైజయంతి మూవీస్ పై బాలీవుడ్ ఫ్యాన్స్ ఏడుపులు.. ఎందుకీ ఫేక్ ప్రచారం..?
వర్షం కారణంగా మిరప పంటకు కూడా భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మిరప పూత సమయంలో భారీ వర్షం పడటంతో పూత రాలిపోయింది. అటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పంటలు కూడా ఇదే స్థాయిలో నష్టపోయాయి. మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తీసుకువచ్చిన మొక్కజొన్న వర్షం తీవ్రతకు తడిచిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఓ మహిళ వర్షం తీవ్రతకు డ్రైనేజీలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని సేకరించే ప్రయత్నం చేస్తుండగా అక్కడ అధికారులు ఆమెను పరామర్శించారు. తమను ఆదుకోవాలని అక్కడకు కలెక్టర్ వెళ్ళగా కలెక్టర్ కాళ్లు పట్టుకుని ఆ మహిళ వేడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

