ఒక రాయి వేయడం చాలా సులభం.. కానీ దాని పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందనే విషయం పూర్తిగా పక్కన పెడతారు. అధికారంలోకి వచ్చేందుకు.. అధికారంలో ఉన్నప్పుడు.. కూడా వైసీపీ నేతలు చేసిన పని ఇదే. కులాల మధ్య చిచ్చు పెట్టి.. కుల కుంపట్లు రాజేయడమే వైసీపీ ఏకైక అజెండా. ఇందుకోసం ఒక్కోసారి ఒక్కోక్కరిని అస్త్రంగా ఎంచుకుంటుంది. కాపు – కమ్మ కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడమే వైసీపీ నేతల ప్రధాన లక్ష్యం. ఇందుకోసం 2014-19 మధ్య మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి అలియాస్ పద్మనాభంను పావుగా వాడుకున్నారు. కాపు రిజర్వేషన్ పోరాటం పేరు ముసుగులో ఏకంగా రైలునే తగలబెట్టేశారు వైసీపీ రౌడీ మూకలు. వందల మంది ప్రాణాలు బలి తీసుకునేందుకు కూడా వెనుకడుగు వేయలేదు. ఆ తర్వాత ముద్రగడ మాటలను ఏపీ ప్రజలు నమ్మటం మానేశారు.
Also Read : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి స్టార్..!
అధికారంలో ఉన్న సమయంలో కూడా రాజధాని అమరావతిపై కులం ముద్ర వేశారు. అలాగే కులం పేరుతో రాజకీయాలు చేశారు. కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇక ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలు తమకు మనుగడ లేకుండా చేస్తాయనే భయంతో ఇప్పుడు కొత్త నాటకానికి తెర లేపారు. 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు పవన్. అదే జరిగితే.. వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భయపడుతున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు ముద్రగడ స్థానంలో కాపు ముసుగు వేసుకున్న కొత్త వైసీపీ అభిమానిని తెర పైకి తీసుకువచ్చారు. కాపులకు కూటమి ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తోందని.. అదే సమయంలో కమ్మ కులానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తోందని.. కాపులపై దాడులకు టీడీపీ నేతలే కారణమని కొత్త ఆరోపణలు చేస్తున్నారు సదరు కొత్త కాపు ముసుగు నేత.
కాపు, తెలగ, బలిజ జేఏసీ నేత పేరుతో దాసరి రాము అనే వ్యక్తి ఇప్పుడు మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నారు. మిమ్మల్ని గెలిపించింది మేమే అంటూ చంద్రబాబబు పైన కమ్మ కులంపైన నేరుగా ఆరోపణలు చేశారు. కమ్మ కులస్తులు వైసీపీ ఐదేళ్ల పాలనలో పారిపోయారని.. కాపు జాతి మాత్రమే ధైర్యంగా జగన్‌ను ఎదిరించి పోరాటం చేసిందని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నిజానికి ఈ దాసరి రాము అనే వ్యక్తి ఎన్నికల వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల్లో జనసేనకు అనుకూలంగా ప్రచారం చేసిన రుజువులు కూడా లేవు. కానీ ఈయన మాత్రం.. కూటమి గెలుపు వెనుక తాను మాత్రమే ఉన్నానంటూ నమ్మించేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు. ఈ సదరు జేఏసీ ముసుగు వేసుకున్న రాము అనే కుల పిచ్చోడు చేస్తున్న ఆరోపణలు.. అందులో వాస్తవాలను ఇప్పుడు జనసేన నేతలు, కాపు నేతలే బయటపెడుతున్నారు.
Also Read : అవినీతికి భారీ మూల్యం.. అసలు తప్పు ఎవరిదీ..?
ఆరోపణ: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు నామినేటెడ్ పదవితో నెలకి నాలుగు లక్షలు తీసుకుంటున్నారు.
వాస్తవం: ఏబీ వెంకటేశ్వర రావు ఏ పదవి తీసుకోలేదు. అలాగే ఆయనకి కూటమి ప్రభుత్వం పదవి ఆఫర్ చేసినా వద్దని తిరస్కరించారు. పైగా ఆ పదవికి 4 లక్షలు జీతం వుండదు కూడా. పైగా ఏడాది కాలంగా ఏబీ వెంకటేశ్వర్రావు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణ: ఒంగోలులో హత్యకకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబానికి ప్రభుత్వం కోటి సాయం అందించింది.
వాస్తవం: వీరయ్య చౌదరి కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏ విధమైన ఆర్ధిక సహాయం చెయ్యలేదు. అలాగే ఆ కుటుంబం ఆర్ధిక సహాయం చెయ్యమని ఎవరినీ అడగలేదు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోనే నారా లోకేష్ పరామర్శించారు.
ఆరోపణ: కందుకూరు హత్య తర్వాత దాసరి రాము, తోట త్రిమూర్తులు వంటి కాపు ముసుగు నేతలు వెళ్లిన తర్వాతే కేసు దర్యాప్తులో కదలిక వచ్చిందని ఆరోపించారు. అలాగే వీరయ్య చౌదరి హత్య కేసులో వ్యవహరించినంత వేగంగా కందుకూరు విషయంలో ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు.
వాస్తవం: కందుకూరు హత్య జరిగిన రోజే నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య అక్టోబర్ 2వ తేదీన జరిగితే.. అక్టోబర్ 3వ తేదీన నిందితులను కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాలు చెరిపేసేందుకు కుట్ర చేశారనే ఆరోపణతో నిందితుడి తండ్రిని అరెస్ట్ చేశారు. హత్యకు కారణమైన వాహనాన్ని, జేసీబీని కూడా సీజ్ చేశారు. ఇక వీరయ్య చౌదరి హత్య జరిగిన 3 వారాల తర్వాత అసలు సూత్రదారిని పోలీసులు గుర్తించారు. ఏప్రిల్‌లో హత్య జరిగితే ఆగస్టులో ముప్పా సురేష్‌ను అరెస్ట్ చేశారు. ఈలోపు సురేష్ పలుమార్లు బెయిల్ పిటిషన్స్ కూడా వేశారు.
Also Read : చావులోను ఆగని విష ప్రచారం.. కులాలను లాగుతోన్న వైసీపీ
ఆరోపణ: దళితుడుని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ, కాపు అనంత బాబు అని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందని ఆరోపించారు.
నిజం: అసలు ఆ విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ చేశారనే వ్యాఖ్యానించారు తప్ప.. ఎక్కడా కులం ప్రస్తావన తీసుకురాలేదు. అదే కాదు.. దళితుడు ప్రసాద్ శిరోముండనంలో కూడా రాష్ట్రపతే లేఖ రాశారు. అందులో కూడా వైసీపీని అన్నారు తప్ప కాపు అనలేదు. నూతన్ నాయుడు మరో దళితుడిని శిరోముండనం వీడియోలతో సహా వచ్చినా వైసీపీ నూతన్ అన్నారు తప్ప కాపు చేశాడని చెప్పలేదు. తోట త్రిమూర్తులు దళితులని శిరోముండనం చేసిన కేసు తీర్పు వచ్చినా.. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు అన్నారు తప్ప కాపు త్రిమూర్తులు అనలేదు.
ఆరోపణ: కుల కార్పొరేషన్ పెట్టి కుల రాజకీయాలు చేసింది తెలుగుదేశం అని పెద్ద ఎత్తున ఆరోపించారు.
నిజం: నాడు చంద్రబాబు మొదలెట్టిన కాపు కార్పొరేషన్ వల్ల ఎంతోమంది కాపులకి లబ్ది జరిగిందని.. దాసరి నారాయణ రావు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాగే చాలా కాపు సమావేశాల్లో తులసీ రామచంద్ర సమక్షంలో కూడా ఇదే ప్రస్తావన చేశారు. ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.
దాసరి రాము అనే వ్యక్తి కాపు కులానికి ఏం చేశారని జనసేన నేతలు, కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే.. కులం పైన కక్ష అని తప్పుడు ప్రచారం చేసేందుకు కూడా వైసీపీ నేతలు వెనుకాడరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు, కులాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని.. కానీ కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైసీపీ మూకలు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు, జనసేన పార్టీ నాయకులు, కాపు సంఘం ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

