Sunday, March 22, 2026 09:30 PM
Sunday, March 22, 2026 09:30 PM

హైదరాబాద్ పోలీసుల మరో సంచలనం

పైరసీ విషయంలో మన సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుందో చూస్తూనే ఉన్నాం. వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తుంటే.. పైరసీ వీరులు సినిమా విడుదలైన రోజు సాయంత్రం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై సినిమా పరిశ్రమ ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన సరే సాధ్యం కానీ పరిస్థితి ఏర్పడింది. అటు బాలీవుడ్ కూడా ఈ విషయంలో ఎన్నో కష్టాలు పడుతోంది. నిందితులు విదేశాల్లో ఎక్కువగా ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది.

Also Read : లిమిట్స్ లో ఉండు.. సజ్జలకు మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక అడుగు వేశారు. పైరసీకి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని సంచలనం సృష్టించారు. దేశంలో తొలిసారిగా పైరసీ నిందితులను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సహా పలు భాషల్లో రిలీజ్ అయిన సినిమాలను పైరసీ చేస్తున్న ఆరుగురును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.

Also Read : పాకిస్తాన్ పరువు తీసిన భారత హీరోలు..!

వీరిలో ఎక్కువమంది మయన్మార్, దుబాయ్, నెదర్లాండ్ దేశాల్లో ఉండి పైరసీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇటీవల కొన్ని సినిమాలు పైరసీకి గురి కావడంతో నిర్మాతలు ఫిర్యాదులు చేశారు. దీనితో వారిపై ఫోకస్ పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వీరిలో కిరణ్ అనే నిందితుడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఒక గ్రామం నుంచి వీరు సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు తేల్చారు. ఇదే కేసులో కొందరు సినీ నటుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్