Thursday, May 7, 2026 01:21 AM
Thursday, May 7, 2026 01:21 AM

హైదరాబాద్ వరదలు.. సైనికులను పవన్ కీలక సూచనలు..!

హైదరాబాద్ లో భారీ వర్షాల దెబ్బకు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. అటు మూసి నది కూడా పొంగుతున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సిఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నడు లేని విధంగా హైదరాబాద్ బస్టాండ్ కూడా వరదలో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మోకాలి లోతు నీళ్ళు ఉన్న నేపధ్యంలో అధికారులు ప్రయాణికులను బస్టాండ్ కు రావద్దని విజ్ఞప్తి చేసారు.

Also Read : మాటల మంటలు.. గట్టిగానే కౌంటర్..!

పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు సైతం నీట మునిగాయి. దీనితో వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో వరద పరిస్థితుల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేసారు. వరద బాధితులకు అండగా నిలవాలని అభిమానులను పవన్‌ కల్యాణ్‌ కోరారు. జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసారు పవన్. వరద బాధితులకు ధైర్యం చెప్పి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు.

Also Read : టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక కఠిన చర్యలు

హైదరాబాద్‌ సహా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మూసీ వరదతో ఎంజీబీఎస్‌తో పాటు పరిసరాలు నీట మునిగాయని పవన్ తెలిపారు. సీఎం రేవంత్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టిందన్న ఆయన, ప్రభుత్వ సూచనలు, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని కోరారు. కాగా పవన్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇటీవల ఓ జీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్.. అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత జ్వరం తీవ్రం కావడంతో, పవన్ ను హైదరాబాద్ తరలించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్