Monday, October 20, 2025 08:34 PM
Monday, October 20, 2025 08:34 PM
roots

అమ్మవారి ఆలయ అధికారులపై విమర్శలు..!

విజయవాడలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ, పర్యాటకశాఖ, మున్సిపల్ శాఖ సంయుక్తంగా దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాయి. దాదాపు నెల రోజుల నుంచి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ముందస్తు చర్యలు చేపట్టారు. అటు భారీ వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా.. చర్యలు తీసుకున్నారు.

Also Read : 41 ఏళ్ల ఆసియా కప్ లో సరికొత్త చరిత్ర

అటు ట్రాఫిక్ పోలీసులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని.. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇవ్వటంతో.. విమర్శలు రాకుండా జాగ్రత్తపడ్డారు అధికారులు. అయితే ప్రధాన ఆలయాన్ని అలంకరించే విషయంలో మాత్రం అధికారులు విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. అమ్మవారి ప్రధానాలయంలో.. అలంకారం విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అధికారులు. సాధారణంగా దసరా ఉత్సవాలు అనగానే.. ప్రధాన ఆలయంలో చేసే ఏర్పాట్లు హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి.

Also Read : రేవంత్ రెడ్డి.. రియల్ రియల్టర్..!

శుక్రవారం కేవలం మామిడి తోరణాలతో మాత్రమే అలంకారం చేశారని వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిన సరే అలంకారం విషయంలో దేవాలయ అధికారులు దృష్టి పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్