Sunday, June 21, 2026 12:19 AM
Sunday, June 21, 2026 12:19 AM

మావోల సంచలన ప్రకటన.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్..!

ఆపరేషన్ కగార్ తో దాదాపు రెండేళ్ళ నుంచి ఇబ్బంది పడుతోన్న మావోయిస్ట్ పార్టీ, ఇప్పుడు పార్టీ అంతర్గత సమస్యలతో కూడా కొత్త సమస్యలు ఎదుర్కొంటోంది. ఓ వైపు బలగాలు, మరో వైపు లొంగుబాట్లు ఇలా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. పార్టీ సీనియర్ నేతల వృద్దాప్య సమస్యలు, కీలక నేతల మరణాలు అన్నీ కూడా పార్టీని పతనావస్థకు చేరుస్తున్నాయి. ఈ తరుణంలో కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ రిలీజ్ చేసిన ఓ ప్రకటన కలవరం రేపింది. తన ఫోటోతో ఆయన ఓ లేఖను మీడియాకు రిలీజ్ చేసారు.

Also Read : బ్రేకింగ్; సేవకులకు టీటీడీ గుడ్ న్యూస్..!

ఆ లేఖలో.. మావోయిస్ట్ లు ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్దంగా ఉన్నారని, ప్రజల అభిప్రాయాలు కావాలని, సహచరులతో చర్చించాలి అంటూ కోరారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆశ్చర్యకరంగా తమ సోషల్ మీడియా ఖాతాలను సైతం ఆయన బయటపెట్టారు. ఇప్పుడు ఇదే పార్టీ ఆగ్రహానికి కారణమైంది. పార్టీ కీలక నేతలు వేణుగోపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది.

Also Read : తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది.. అసెంబ్లీ లాబీలో బాలయ్య సందడి

భూపతి వద్ద ఉన్న ఆయుధ సామగ్రి పార్టీకి అప్పజెప్పాలని స్పష్టం చేసింది. ఆయధ సామగ్రి అప్పగించకపోతే పీపుల్స్‌ గొరిల్లా ఆర్మీ తీసుకోవాలని ఆదేశించింది. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుగోపాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. మల్లోజుల వేణుగోపాల్‌ లొంగిపోయేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు పార్టీ తమ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతకు భూపతి మరిది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్