Wednesday, August 5, 2026 08:52 AM
Wednesday, August 5, 2026 08:52 AM

బ్రేకింగ్: సేవకులకు టీటీడీ గుడ్ న్యూస్..!

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను, తప్పులను సరి చేస్తూ ముందుకు అడుగు వేస్తున్నారు. పలు సంస్కరణలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. నేడు మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీవారి సేవకుల తో టీటీడీ ఛైర్మన్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. బ్రహ్మోతవాలపై శ్రీవారి సేవకులకు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దిశానిర్దేశం చేసారు.

Also Read : తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది.. అసెంబ్లీ లాబీలో బాలయ్య సందడి

బ్రహ్మోతవాల్లో భక్తుల సేవలో 3,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారని, శ్రీవారి సేవకులు.. భగవత్‌ బంధువులు అని కొనియాడారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిలో భగవంతుడు ఉంటాడన్నారు. భక్తులకు సేవ చేస్తే.. ఆ స్వామికి సేవ చేసినట్లేనని కొనియాడారు. ఇక నుంచి సేవకులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవ చేసేందుకు ఎందరో ప్రముఖులు పోటీపడుతున్నారని, సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం శ్రీవారి సేవకుల వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

Also Read : విదేశీ డాక్టర్ లకు ట్రంప్ గుడ్ న్యూస్..?

శ్రీవారి సేవకులకు వారి సేవ కాలం ముగిశాక శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సేవకుల విశేష సేవలకు అది సరిపోదని, ప్రత్యేక ప్రవేశ దర్శన స్థానంలో శ్రీవారిని దగ్గరగా దర్శించుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ సారి భక్తుల కోసం ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల వేళ 16 రకాల వంటకాలు పంపిణీ చేయనుందని, వాహన సేవల కోసం మాడ వీధుల్లోని మూలల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35000 మందికి రీఫిల్లింగ్‌ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్