Saturday, September 13, 2025 01:22 AM
Saturday, September 13, 2025 01:22 AM
roots

రిలీజ్ కు ముందే వార్ 2 భారీ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ నటించిన యాక్షన్ థ్రిల్లర్, వార్ 2. బాలీవుడ్ జనాల కంటే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. దేవర సినిమా రిలీజ్ తర్వాత నుంచి వస్తున్న సినిమా ఇదే. దీనితో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మించారు.

Also Read : జగనన్నా.. మాకు ఈ రెడ్డి గారు వద్దన్నా ప్లీజ్..!

ఆగస్ట్ 15 సందర్భంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. హిందీ, తమిళం, తెలుగు భాషలలో పాన్-ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమ్మా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం 70 కోట్ల వరకు తీసుకుంటున్న ఎన్టీఆర్.. తెలుగులో వచ్చే లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడు అని టాక్. దీనిపై జాతీయ మీడియా ఓ న్యూస్ ప్రచురించింది. తెలుగులో ప్రమోషన్ బాధ్యత ఎన్టీఆర్ కు ఇచ్చినట్టు సమాచారం.

Also Read : ఆ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్..!

బాలీవుడ్ న్యూస్ ప్రకారం.. ఈ సినిమా హక్కులను నాగ వంశీ దాదాపు 90 కోట్లకు కొన్నట్టు టాక్. 400 కోట్ల బడ్జెట్ లో 90 కోట్లు వెనక్కు వచ్చేసాయని, థియేటర్ లాభాలు అన్నీ నాగ వంశీనే తీసుకుంటాడు అంటూ కథనం వచ్చింది. నాగ వంశీతో ఎన్టీఆర్ ఒప్పందం ప్రకారం.. ఎన్టీఆర్ కు లాభాల్లో వాటా రానుంది. ఇక హృతిక్ రోషన్ కు అడ్వాన్స్ గా 50 కోట్లు ఇచ్చింది యష్ రాజ్ ఫిలిమ్స్. సినిమా లాభాల్లో కూడా అతనికి వాటా ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్