Wednesday, August 5, 2026 08:14 AM
Wednesday, August 5, 2026 08:14 AM

గుండెపోటు వస్తే అల్లం కాపాడుతుందా..?

ఈ రోజుల్లో గుండెపోటు అనే మాట వింటే సాధారణ ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష అనే తేడాలు లేకుండా చుక్కలు చూపిస్తోంది. గతంలో లావుగా ఉండేవారికి, వయసు పైబడిన వారికి, 50 ఏళ్ళు దాటిన వారికి గుండెపోటు వస్తుందనే మాట ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయి సినిమా కొత్తగా కనపడుతోంది. తాజాగా హైదరాబాద్ లో 25 ఏళ్ళ యువకుడు, అనంతపురంలో డాక్టర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో భయాలు మరింత పెరిగాయి.

Also Read : అమెరికా, రష్యాలను వణికించిన భూకంపం.. రష్యాలో సునామీ భీభత్సం..!

ఈ తరుణంలో ఓ డాక్టర్ ప్రజలకు విలువైన సలహా ఇచ్చాడు. ఆయుర్వేద వైద్యుడు ఆచార్య మనీష్ జీ ఓ వీడియోలో కీలక సలహా ఇచ్చారు. సాధారణంగా గుండెపోటు వస్తే చాలా మంది అంబులెన్స్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోపు అది ప్రాణాలకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాని ఉపశమనంగా అల్లం నోట్లో పెట్టుకుని ఆ రసం మింగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుందని సూచించారు. 99 శాతం మందికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

Also Read : బెంగళూరులో ఆల్ ఖైదా ఉగ్రవాది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కలిసి..!

అయితే ఈ కామెంట్స్ ను వాస్కులర్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ వరుణ్ బన్సాల్‌ తప్పుబట్టారు. అల్లం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని, హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది అనే మాట కొంత వరకు నిజమే కాని అది దీర్ఘకాలికంగా ఉపయోగపడే అవకాశం లేదన్నారు. గుండెపోటుకి అల్లానికి అసలు సంబంధం లేదని స్పష్టం చేసారు. గుండెపోటు వస్తే రోగిని కూర్చోబెట్టి అల్లం తినిపించడం అనేది కరెక్ట్ కాదన్నారు. గుండెపోటు వస్తే రోగిని పడుకోబెట్టి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్