Saturday, September 19, 2026 02:23 PM
Saturday, September 19, 2026 02:23 PM

టీమిండియాకు గుడ్ న్యూస్.. పంజాబీ బౌలర్ వచ్చేస్తున్నాడు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ కీలకమైన చివరి టెస్టులో గెలవడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకునేందుకు సిద్ధమవుతోంది. బౌలింగ్ విభాగంలో విఫలం కావడంతో జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాలుగో టెస్ట్ లో డ్రా చేసినా సరే ఎన్నో లోపాలు జట్టు యాజమాన్యాన్ని వెంటాడుతున్నాయి. అన్షుల్ కాంబోజ్ పై జట్టు యాజమాన్యం ఎన్నో ఆశలు పెట్టుకున్నా సరే అతను ఘోరంగా విఫలమయ్యాడు. బౌలింగ్ లో వేగం లేకపోవడంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Also Read  : బీసిసిఐ సంచలన నిర్ణయం.. వాళ్లకు గుడ్ బై..!

బూమ్రాకు సరైన సహకారం లేదని విమర్శలు సైతం వచ్చాయి. చివరకు అతను కూడా విఫలం కావడంతో చివరి టెస్టులో భారత్ ఏ ప్రయోగాలు చేయబోతుంది అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ లో మరో ప్రయోగం చేసేందుకు భారత్ రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాని అర్షదీప్ సింగ్ చివరి టెస్టులో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. గాయం కారణంగా నాలుగో టెస్ట్ కు దూరమైన అతను ఐదవ టెస్టులో ఖచ్చితంగా ఆడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అతను అరంగేట్రం చేస్తున్నట్లు జట్టులోని మిగతా ఆటగాళ్లకు కెప్టెన్ గిల్ చెప్పినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also Read  : యాషెస్ లో చుక్కలు చూపిస్తాం.. ఇంగ్లాండ్ కు ఆసిస్ స్ట్రాంగ్ వార్నింగ్

లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ కావడంతో కచ్చితంగా ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టడంలో అతను సఫలం అవుతాడని ఆశిస్తున్నారు. భారత్ కు జహీర్ ఖాన్ తర్వాత టెస్టుల్లో సమర్థవంతమైన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ లేడు. ఆ లోటును అర్షదీప్ సింగ్ ఖచ్చితంగా భర్తీ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలిగే ఈ పంజాబీ బౌలర్..భారత్ కు భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు ఎప్పటి నుంచో అభిప్రాయపడుతున్నారు. అటు మాజీ ఆటగాళ్లు కూడా అతనిని తుది జట్టులో ఆడించాలని కోరుతున్నారు. చివరకు అతను అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయం అయినట్లుగానే కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్