Wednesday, February 4, 2026 09:28 PM
Wednesday, February 4, 2026 09:28 PM

యాషెస్ లో చుక్కలు చూపిస్తాం.. ఇంగ్లాండ్ కు ఆసిస్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ – ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ ప్రవర్తనపై ప్రపంచ వ్యాప్తంగా మాజీ క్రికెటర్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మాజీ ఆటగాళ్ళు అలిస్టర్ కుక్, మోయీన్ అలీ, మైకేల్ వాన్ వంటి వాళ్ళు స్టోక్స్, సహా ఇంగ్లాండ్ ఆటగాళ్ళ తీరును ఎండగట్టారు. ఆ సమయంలో భారత్ చేసింది కరెక్ట్ అంటూ సమర్ధించారు. అంత సేపు పోరాటం చేసిన ఆటగాళ్ళు సెంచరీ చేయాలి అనుకోవడంలో తప్పు ఏంటీ అంటూ నిలదీశారు.

Also Read : టీసీఎస్ నిర్ణయం వెనుక కారణం అదేనా..?

తాజాగా దీనిపై ఆసిస్ మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేసాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లపై జాక్ క్రాలే, బెన్ డకెట్ చేసిన మాటల దాడికి ఆస్ట్రేలియాలో ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించాడు. “ఆ టెస్ట్ మ్యాచ్ చివర్లో ఆసక్తికరంగా మారింది. సుందర్, జడేజా అద్భుతంగా ఆడారు. ఇంగ్లాండ్ ఈ టెస్ట్ గెలుస్తామని అంచనా వేసుకుంది. వాళ్ళిద్దరి నుంచి ఇంగ్లాండ్ అది ఊహించలేదు. గిల్, రాహుల్ ఇద్దరూ అద్భుతంగా ఆడారని కొనియాడాడు.

Also Read : బీసిసిఐ సంచలన నిర్ణయం.. వాళ్లకు గుడ్ బై..!

ఇంగ్లాండ్ కు గెలవలేమని అర్ధమై డ్రామాలు ఆడిందని మండిపడ్డాడు. ఇంగ్లాండ్ గెలవదు కాబట్టి ఆపేద్దాం అనుకున్నారని.. వాళ్ళు ఆపాలి అనుకున్నారు కాబట్టి ఇండియా కూడా ఆపాలి అనుకోవడం కరెక్ట్ కాదని.. ఇక్కడ భారత్ చేసింది కరెక్ట్ అని మద్దతు ఇచ్చాడు. వాళ్లకు బ్యాటింగ్ చేసే హక్కు ఉంది… ఇంగ్లాండ్ వాళ్ళు ఊహించంట్టు జరగలేదు. అందుకే ఇంగ్లాండ్ సంతోషంగా లేదని వ్యాఖ్యానించాడు. డకెట్, క్రాలీ ఇద్దరినీ ఆస్ట్రేలియా గమనిస్తుందని, వాళ్లకు రియాక్షన్ ఆస్ట్రేలియాలో చూపిస్తామన్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్