Sunday, March 22, 2026 11:19 PM
Sunday, March 22, 2026 11:19 PM

మార్పు ఖాయం.. వేటు వారిపైనేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన సహచర మంత్రుల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఒకరేంజ్‌లో ఫైర్ అయ్యారు కూడా. కొంతమంది పనితీరు ఏ మాత్రం సరిగ్గా లేదని.. ఇక కొంతమంది అయితే అవినీతిలో తారాస్థాయికి చేరుకున్నారని నలుగురిలోనే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే భరించడం తన వల్ల కాదన్న చంద్రబాబు… 1995 సీబీఎన్‌ను చూస్తారా అని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ విషయాలు బయటకు రావడంతో.. త్వరలోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : ఆ నియోజకవర్గాలకు కొత్త బాసులు..!

చంద్రబాబు వద్ద పని చేయాలంటే తప్పని సరిగా ఆయన మార్కు ఆలోచనలు చేయాల్సిందే. అలా చేసిన వారికే చంద్రబాబు వద్ద మార్కులు పడతాయి. లేదంటే.. వారిని పక్కకి తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇస్తారు. సీనియర్లు చాలా మందికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. అందుకే అధినేతను ప్రసన్నం చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అయితే నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తొలిసారి తన మంత్రివర్గంలో ఎక్కువగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు. చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేసిన చంద్రబాబు.. తన క్యాబినేట్‌లో తొలిసారి గెలిచిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే విషయంపై అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. వాస్తవానికి పరిపాలన విషయంలో ప్రయోగాలు చేస్తారనేది చంద్రబాబుకు ఉన్న పేరు. కానీ ఈసారి మాత్రం మంత్రి వర్గ కూర్పులో ప్రయోగాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముహుర్తం ఫిక్స్..!

అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల నిర్వహించిన క్యాబినేట్ సమావేశంలో తన సహచర మంత్రుల పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇదే విషయంపై తాజాగా ప్రముఖ సర్వే సంస్థ రైజ్ అధినేత ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుదు వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో మొత్తం ఏడుగురిపైన వేటుకు రంగం సిద్ధం అంటూ పోస్టు చేశారు. అలాకే పలువురికి శాఖల మార్పు కూడా.. అంటూ ప్రవీణ్ పోస్ట్ చేశారు. వాసంశెట్టి సుభాష్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎస్.సవితతో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా హిట్ లిస్ట్‌లో ఉన్నారంటూ ప్రవీణ్ వ్యాఖ్యానించారు. అలాగే గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర పేరుకు మాత్రమే మంత్రులని, నడిపేది అంతా పై వాళ్లు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.

ప్రవీణ్ పుల్లట చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తీరు బాగుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హోమ్ మంత్రి అనిత గారిని మర్చిపోయారా మీరు.. అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ కొందరు మంత్రులు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని.. ముందు అలాంటి వారిని తీసెయ్యాలని పోస్టు చేస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులే వైసీపీ కోవర్టులుగా ఉన్నారేమో అని అనుమానం ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు, ప్రవీణ్ పుల్లట పోస్టు పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్