Wednesday, February 4, 2026 11:31 PM
Wednesday, February 4, 2026 11:31 PM

ఈసారికి నన్ను వదిలేయండి.. ప్లీజ్..!

అందరికీ నమస్కారం.. ముందుగా అందరికీ ఒకమాట. ఈ వార్తలో ఎక్కడా మా సొంత విశ్లేషణ లేదు. పూర్తిగా సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం.. తాజా రాజకీయ పరిణామాలపై న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలే ఇక్కడ మీకు వార్త రూపంలో ఇవ్వడం జరుగుతోంది. అంతే తప్ప.. ఈ వార్తలో ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ వార్త ఎవరినీ ఉద్దేశించి రాసింది అస్సలు కాదు. ఇక అసలు వార్తలోకి వస్తే.. చేయాల్సిందంతా చేసేసి.. నాకేం తెలియదు అన్నారంట వెనకటికి ఒకడు.. అనే సామెత ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఈ మాటను ఎక్కువగా సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఎవరేం చేశారు.. ఇప్పుడు ఎందుకు తెలియదంటున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Also Read : అన్నతో సయోధ్య కుదిరినట్టే..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదేమిటంటే.. వైసీపీ నేతలకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఎలా వస్తున్నాయనేది టీడీపీ నేతల ప్రశ్న. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చూస్తుంటే.. న్యాయస్థానం ఎలా రక్షిస్తుందనేది బాగా వినిపిస్తున్న మాట. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలే ఈ ప్రశ్నలకు కారణం. సింగయ్య మృతి కేసులో డ్రైవర్‌తో పాటు జగన్, విడదల రజినీ, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు బెంచ్ దర్యాప్తు నిలిపివేస్తు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 137 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అలాగే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై 10 రోజుల వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు కేసులో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తరఫున లాయర్ నాగిరెడ్డి వాదనతో ఏకీభవించి విక్రాంత్ రెడ్డిపై ఉన్న లుకౌట్ సర్క్యులర్‌ మీద స్టే విధించిన హైకోర్టు. ఇక వీటితో పాటు అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోర్టులో అరెస్టైన పాత్రికేయుడు కృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.

Also Read : అప్పుడు వైఎస్ సునీత, ఇప్పుడు సింగయ్య భార్య.. జగన్ ఫార్ములా

విచిత్రమైన విషయం ఏమిటంటే.. కేసులన్నింటిలో ఒక విషయం మాత్రం కామన్‌గా ఉంది. అదేమిటంటే.. జస్టిస్ శ్రీనివాసరెడ్డి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి బెంచ్ బెయిల్ మంజూరు చేసిందని, స్టేలు విధించిందనేది టీడీపీ నేతల మాట. ముఖ్యంగా సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్‌, మరికొందరిపై దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వర్ల రామయ్య. విచారించే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా, బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించే ధోరణిలో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. కొంతమంది కులం పేరుతో కూడా కామెంట్లు చేశారు.

Also Read : కొనసా…గుతోన్న ఏసీబీ విచారణ..!

ఓ వైపు రెండు రోజులుగా సోషల్ మీడియాలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి పేరుతో పెద్ద ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. స్వయంగా ఆయనే ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనే కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పిటిషనర్లకు సూచించింది. ఆ తర్వాత జస్టిస్ శ్రీనివాసరెడ్డి తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని.. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్‌కు పనికతి వస్తాయన్నారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే బెంచ్‌ ముందు చూసుకోవాలని సూచించారు.

Also Read : బీఆర్ఎస్‌లో జూబ్లీహిల్స్ వార్..!

అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వచ్చే మంగళవారానికి జస్టిస్ శ్రీనివాసరెడ్డి వాయిదా వేశారు. అదే సమయంలో తన ముందున్న బెయిల్ పిటిషన్లు వేరే బెంచ్ ముందు చూసుకోవాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. వైసీపీ అధినేతకు అనుకూలంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి వ్యవహరించారనేది టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల ఆరోపణ. అందుకే సోషల్ మీడియాలో పేపర్ కటింగ్స్ పెట్టి జస్టిస్ శ్రీనివాసరెడ్డి పేరును ప్రస్తావించారు. అంతే తప్ప.. ఆయనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.

జస్టిస్ శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. న్యాయమూర్తిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు. వాస్తవానికి జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారనే కారణంతో న్యాయమూర్తులపై వైసీపీ కార్యకర్తలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. పంచ్ ప్రభాకర్ వంటి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఉన్నాయి. అయినా సరే.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ విషయం మర్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం న్యాయ వ్యవస్థపై టీడీపీ నేతల దాడి, కుట్ర అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్