Friday, September 12, 2025 11:30 PM
Friday, September 12, 2025 11:30 PM
roots

సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?

కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మార్పు అనే వార్త జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఒకటి జరిగింది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన తాను సిఎం కావాలనుకుంటున్నా అంటూ పార్టీ అధిష్టానం వద్ద అలాగే రాష్ట్ర నాయకుల వద్ద డీకే బహిరంగంగానే వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు క్లారిటీ ఇచ్చేసారు డీకే శివకుమార్.

Also Read : రష్యా స్నేహం ఇండియాను ముంచుతుందా..? ట్రంప్ సంచలన బిల్..!

మంగళవారం సాయంత్రం – పార్టీ ట్రబుల్షూటర్ రణదీప్ సుర్జేవాలాతో చర్చల తర్వాత జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. తన తరుపున ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడకూడదు అని కోరారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ లో ఓ వర్గం కోరుతుంది అనే వార్తల నేపధ్యంలో ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన డీకే, రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికలను కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read : మిడిల్ క్లాస్ కు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గే ధరలు ఇవే

2028 ఎన్నికలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసారు. కాంగ్రెస్‌లో వర్గాలు లేవు అన్నారు. పార్టీ బాస్ మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఒకే ఒక కాంగ్రెస్ ఉందని స్పష్టం చేసారు ఆయన. పార్టీ క్రమశిక్షణ లైన్ ను ఎవరూ దాటే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్‌లోని 138 మంది ఎమ్మెల్యేలలో 100 మంది సిద్ధరామయ్యను తొలగించి అతని స్థానంలోకి డీకేను తీసుకు రావాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారని ఓ ఎమ్మెల్యే నోటీసు కూడా ఇచ్చారు. మే 2023 ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై భారీ విజయాన్ని సాధించింది.

2023 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయంలో డీకే – సిద్దరామయ్య ఒప్పందం ప్రకారం, రెండున్నరేళ్ళు ఒకరు, మరో రెండున్నరేళ్ళు మరొకరు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అసంతృప్తి గుసగుసలు ఊపందుకున్న కొద్దీ.. సిద్దరామయ్య పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాల గురించి డీకే అనుచరులు మాట్లాడుకుంటున్నారు అనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఏది ఎలా ఉన్నా ప్రస్తుత వివాదం ముగిసినా భవిష్యత్తులో మాత్రం డీకే సిఎం కావడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్