Thursday, February 5, 2026 01:30 AM
Thursday, February 5, 2026 01:30 AM

అసలు అమరావతిలో ఏం జరుగుతోంది..?

అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని.. దేవతల రాజధాని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ సిటీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని. మరి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడా అనే ప్రశ్నకు అందరి ఆమోదంతోనే గుంటూరు – విజయవాడ మధ్య అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 34 వేల ఎకరాలను సేకరించారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మిస్తామని 2016 లోనే సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు.

Also Read : బైక్ ట్యాక్సీ ఉండాలా.. వద్దా..!

ఇదంతా 2019 ఎన్నికలకు ముందు. వైసీపీ గెలిస్తే అమరావతి నిర్మాణ పనులు ఆగిపోతాయని అప్పట్లో టీడీపీ అధినేత ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇల్లు తాడేపల్లిలో రాజధాని అమరావతి పరిధిలోనే ఉందని.. చంద్రబాబుకే సొంత ఇల్లు లేదని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ గెలిచిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోయింది. విచిత్రంగా 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతి పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. రైతులు, మహిళలు ఉద్యమం చేయడంతో 3 రాజధానుల ప్రక్రియ ఆగిపోయింది. కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులు వేగం అందుకున్నాయి. వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. 2027 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Also Read : ఓజీ కోసం లూసిఫర్ ఫార్ములా.. షూటింగ్ మొత్తం అక్కడే..?

అయితే ఇక్కడే అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 11 ఏళ్ల నిండింది. అమరావతి పనులకు శంకుస్థాపన పడి 9 ఏళ్లు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. అమరావతి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ 9 ఏళ్లలో అమరావతిలో జరిగిన అభివృద్ధి ఏమిటీ అంటే.. శూన్యమనే చెప్పాలి. అమరావతి ప్రజా రాజధాని అని నిత్యం చెప్పే టీడీపీ నేతలు కూడా అమరావతి పరిధిలో ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అమరావతిలో ఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే.. మాజీ సీఎం జగన్ ఇల్లు.. తాజా సీఎం చంద్రబాబు కడుతున్న ఇల్లు తప్ప మరో అధికారిక నివాసం అనేది ఇప్పటి వరకు రాలేదు.

Also Read : తల్లికి వందనంపై విమర్శలు అందుకే రాలేదా..?

వాస్తవానికి అమరావతి పేరుతో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. ముందే తక్కువ ధరకు వందల ఎకరాలు కొనుగోలు చేసేశారని వైసీపీ నేతలు మొదట్లోనే ఆరోపణలు చేశారు. మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్‌తో పాటు లోకేష్ పై కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అధినేత ఇల్లు కట్టుకుంటున్నా సరే.. టీడీపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్కరు కూడా ముందుకు వచ్చి అమరావతిలో ఇంటి నిర్మాణం ప్రారంభించిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కోట్లు విలువ చేస్తుందని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి అలాంటి చోట ఎందుకు సొంత ఇల్లు కట్టుకోవటం లేదనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. చివరికి రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు కూడా రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేదు. ఆయన గుంటూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.

Also Read : ఇంటింటికీ తొలి అడుగు.. పడుతుందా..?

ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా వ్యక్తిగత గృహనిర్మాణ కార్యక్రమాలు చేపట్టకపోవడం తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. వాస్తవానికి చాలా మంది రాజకీయ నేతలు హైదరాబాద్‌కు ఏదైనా పని మీద వెళ్లినప్పుడు అక్కడి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే బస చేసేవారు. అయితే 1995 తర్వాత హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో.. ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరు నేతలకు కూడా హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ.. ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి వస్తునే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీకెండ్ టూర్‌ చేస్తున్నారు. నేతలకు ఇల్లు లేదు కానీ.. మనల్ని కట్టుకోమంటారేమిటి అనే ప్రశ్న ఇప్పుడు పారిశ్రామిక వేత్తలను వేధిస్తోంది. నేతల్లో స్పష్టమైన నిబద్ధత లేకపోవడం వల్ల ప్రజలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ఆకర్షించే ప్రయత్నాలు దెబ్బతింటున్నాయి.

Also Read : లిక్కర్ కేసులో కీలక ముందడుగు.. సంచలనానికి సిద్దం..!

వాస్తవానికి 2030 నాటికి అమరావతి నివాస యోగ్యమైన నగరంగా మారుతుందని చంద్రబాబు వెల్లడించారు. అంటే రాష్ట్రం విడిపోయిన 16 ఏళ్ల తర్వాతే అక్కడ నివాసానికి అనుకూలమైన వాతావరణం వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, న్యాయమూర్తులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేరు వేరుగా నివాస సముదాయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇవి ప్రభుత్వ ఆస్తి. వీటిల్లోనే ఉండే తామంతా విధులు నిర్వహిస్తామంటే మాత్రం.. అమరావతి మనుగడ సాగిస్తుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ప్రతి రోజు సచివాలయం వచ్చే మంత్రులు కూడా అమరావతిలో ఎక్కడా ఉండటం లేదు. వీరంతా విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. పైగా అమరావతిలో కనీసం ఒక్క చోట కూడా వీళ్లల్లో ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించటం లేదు. అంటే అమరావతి ప్రాంతం నివాసయోగ్యం కాదని మంత్రులు, ప్రజాప్రతినిధులే స్వయంగా చెబుతున్నట్లుందనే విమర్శలు తలెత్తుతున్నాయి.

Also Read : హాట్ టాపిక్‌గా బన్నీ యాటిట్యూడ్

రాజకీయ నాయకత్వం ప్రాధాన్యత ఒక ముఖ్యమైన అంశం. రాజధాని వృద్ధికి నాయకుల్లో నిబద్ధత లేకపోవడాన్ని సూచిస్తుంది. వాస్తవానికి నిర్మాణాలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. నాయకులు ముందుగా వస్తే.. పెట్టుబడిదారుల్లో కూడా నమ్మకం పెరుగుతుంది. అప్పుడే అమరావతి నిజమైన ప్రజల రాజధానిగా మారుతుందని నిర్ధారిస్తారు. రాజకీయ నాయకులు అక్కడ ఎలాంటి నివాసం ఏర్పాటు చేసుకోకుండా.. విజయవాడ, గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తూ.. వీకెండ్‌లో హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచే తమ లావాదేవీలు నిర్వహిస్తే మాత్రం అమరావతిపై ఎవరికీ నమ్మకం రాదు. అప్పుడు సామాజిక, సాంస్కృతిక గుర్తింపు కలిగిన రాజధానిగా కాకుండా కేవలం అధికారిక కేంద్రంగా భావించే ప్రమాదం కూడా ఉంది.

Also Read : ఇంగ్లాండ్‌లో తెలుగోడికి ఛాన్స్ కష్టమే

నాయకుల్లో నిబద్ధత లేనంత వరకు అమరావతికి పరిశ్రమలు, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు చేయూత లభించడం కష్టం. అప్పుడు ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపించదు. దీని వల్ల ఉద్యోగ సృష్టి, పట్టణాభివృద్ధి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది పెద్దగా ఫలితం చూపించదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా మారడానికి అమరావతి ప్రయాణం కీలకమైన దశలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధతతో సొంత ఇల్లు కట్టుకుంటుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మాత్రం ఇలాంటి ప్రయత్నాలు లేకపోవడం ప్రాజెక్ట్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ప్రభుత్వ గృహాలపైనే ఆధారపడటం, హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అమరావతిపై జరిగే విష ప్రచారానికి నేతలు కూడా తమ వంతు సహకారం అందించిన వారు అవుతారనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్