Saturday, September 19, 2026 08:15 PM
Saturday, September 19, 2026 08:15 PM

ఓజీ కోసం లూసిఫర్ ఫార్ములా.. షూటింగ్ మొత్తం అక్కడే..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆయన అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఎప్పుడో ఒక సినిమా రిలీజ్ చేయడం.. మరో సినిమాకి సంతకం చేయడం, ఆ సినిమా షూటింగ్ ఆలస్యంగా చేయడం.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేకపోవడం.. అసలు పవన్ కళ్యాణ్ షూటింగ్ కు వెళ్తారో లేదో తెలియకపోవడం.. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రిలీజ్ చేయకపోవడం.. ఇలా ఎన్నో పవన్ కళ్యాణ్ అభిమానులను వేధిస్తూ వస్తున్నాయి.

Also Read : తండ్రీ కొడుకులకు మూడిందా..? మంత్రి సంచలనం

పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం.. హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సరే ఇప్పటివరకు సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. త్వరలోనే సినిమా ట్రైలర్ అలాగే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు. ఇక సినిమా కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు 11 కోట్ల రూపాయలను ఆయన తిరిగి ఇచ్చేసారట. ఇక్కడ వరకు బాగానే ఉన్నా తర్వాత రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. అందులో ఒకటి ఓజి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ అయిపోయి షూటింగ్ కూడా మొదలైపోయింది.

Also Read : తన్నుకున్నారు.. కలిశారు.. బకరా చేశారు..!

సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారు. అయితే సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం లూసిఫర్ సినిమా ఫార్ములా వాడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఆ సినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. సినిమా షూటింగ్లో దాదాపు 80 శాతం కేరళలోనే పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం లో 15% ముంబైలో మిగిలినది రష్యాలో పూర్తి చేశారు. ఈ సినిమాకి కూడా దాదాపు 80% ఆంధ్రప్రదేశ్ లో పూర్తి చేసి మిగిలినది విదేశాల్లో షూట్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే విజయవాడలో షూటింగ్ మొదలైంది. త్వరలోనే విశాఖలో షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ కనబడుతోంది. కొద్ది గొప్ప షూటింగ్ జరిగితే బెంగళూరు లేదా ముంబైలో జరిగే అవకాశం ఉందని దాదాపుగా షూటింగ్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్