Wednesday, February 4, 2026 09:37 PM
Wednesday, February 4, 2026 09:37 PM

పని వేళల్లో మార్పు.. ఎందుకీ సవరణ..?

రోజుకు 24 గంటలు సమయం.. అందులో కనీసం 8 గంటలు నిద్రకు కేటాయించాలనేది వైద్యుల సూచన. ఇక మిగిలిన 16 గంటల్లో ఏం చేయాలి అంటే.. 2 గంటలు ఇతర అవసరాల కోసం కేటాయించాలి. మిగిలిన 14 గంటల్లో 8 గంటలు పనికి కేటాయిస్తారు. మిగిలిన 6 గంటలు పూర్తిగా సొంత పనులకే కేటాయిస్తున్నట్లు సర్వేల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. పని గంటలను రోజుకు 9 నుంచి 10 గంటలకు పెంచుతున్నట్లు మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. ఇందుకు ప్రధాన కారణం.. ఏపీలో పరిశ్రమలను ప్రొత్సహించటమే లక్ష్యమంటున్నారు ప్రభుత్వ పెద్దలు.

ఏపీలో పెట్టుబడులు ఆకర్షించడమే కూటమి సర్కార్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. సాధారణంగా చంద్రబాబు పేరు చెప్పగానే కార్పొరేట్ సీఈవో అని అంతా భావిస్తారు. 1995లో తొలిసారి సీఎం కుర్చీల్లో కూర్చొన్నప్పుడు కూడా తనని తాను ఏపీ సీఈవోగా, బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.. ప్రమోట్ చేసుకున్నారు. తన వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, టీసీఎస్ వంటి బడా సంస్థలు పెట్టుబడులు పెట్టాయనేది చంద్రబాబు మాట. ఇప్పుడు కూడా నేనే హైదరాబాద్ డెవలప్ చేశా అని గొప్పగా చెప్తారు.

Also Read : మీరు ఆపేస్తే.. మేము కూడా రెడీ.. సై అంటే సై..!

ఇక నాలుగోసారి సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు. నిత్యం కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వారికి రాయితీలు కూడా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖలో టీసీఎస్ సంస్థకు ఎకరా రూపాయికే భూమి కేటాయించారు. అలాగే భారీ ఎత్తున రాయితీలు కూడా కల్పిస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలను ప్రొత్సహించే లక్ష్యంతోనే ప్రైవేటు రంగ ఉద్యోగుల పని గంటలను సవరిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.

రోజుకు పని గంటలను 9 నుండి 10 గంటలకు పెంచే నిర్ణయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కార్మిక చట్టాలను సవరించింది. ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టంలో కూడా మార్పులు చేయనున్నారు. గతంలో ఈ పరిమితి 8 గంటలు మాత్రమే. దీనిని దశాబ్దం క్రితం 9 గంటలకు పొడిగించారు. నాటి నుంచి అమలవుతున్న 9 పని గంటలను ఇప్పుడు 10 గంటలకు పెంచింది ప్రభుత్వం. ఈ కొత్త నిబంధన అన్ని ప్రైవేటు సంస్థలు, కర్మాగారాలకు కూడా వర్తిస్తుంది.

Also Read : ఎలా బతికానో చెప్పిన రమేష్.. సీటు బెల్ట్ ప్రాణాలు కాపాడిందా..?

ఇదంతా వ్యాపారం చేయడం సులభం విధానంలో భాగమన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి. చట్టంలోని సెక్షన్ 54 ప్రకారమే పని గంటలను మార్చామన్నారు. ఇక సెక్షన్ 55 కింద పని సమయంలో విరామ గడువు కూడా మార్చారు. 5 గంటల నిరంతరం పని తర్వాత ప్రతి ఒక్కరికి తప్పని సరిగా 30 నిమిషాల విరామం ఇవ్వాలి. అలాగే ఓవర్ టైమ్ పరిమితిని కూడా ప్రస్తుతమున్న 75 గంటలను 144 గంటలకు పెంచారు.

కార్మిక చట్టాల్లో మార్పులు, పని గంటల పొడిగింపు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనిపై కార్మిక సంఘాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పని గంటల పెంపు వల్ల కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఇక సవరించిన షెడ్యూల్‌కు మించి కార్మికులను పనిలో ఉంచాలని యజమానులు బలవంతం చేస్తారని ఆరోపించారు. రోజు వారీ షిఫ్ట్‌లను 12 గంటలకు మించి ఉంచే ప్రమాదం ఉందనేది కార్మిక సంఘాల ఆరోపణ. ఈ పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్