Wednesday, August 5, 2026 03:58 PM
Wednesday, August 5, 2026 03:58 PM

పార్ట్ టైం బౌలర్ ఎక్కడ..? భారత జట్టుకు ఇదే సమస్య

అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు.. అత్యంత బలమైన జట్టుగా కనపడుతున్నా కొన్ని లోపాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. పేస్ ఆల్రౌండర్ విషయంలో భారత జట్టు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది. ఓ వైపు అన్ని దేశాలు పేస్ ఆల్రౌండర్ మీద దృష్టి పెడితే భారత జట్టు మాత్రం ఆ విషయంలో విఫలమవుతూ వచ్చింది. భారత్ లో స్పిన్ బౌలింగ్ తో నెట్టుకు వస్తున్న భారత జట్టు విదేశాలకు వెళ్ళిన సమయంలో ఈ లోపంతో బాగా ఇబ్బంది పడుతోంది. శార్దుల్ ఠాకూర్ వంటి వాళ్ళు వచ్చినా నిలకడ లేక ఇబ్బంది పడుతున్నారు.

Also Read : కామెడీ అయిపోతున్న జగన్.. ఎందుకిలా..?

నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత మాత్రం క్రమంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అతను పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇది ఒక లోపం అయితే.. పార్ట్ టైం బౌలర్ విషయంలో మాత్రం భారత్ గత పదేళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జడేజా ముందు పార్ట్ టైం బౌలర్ గా కనపడినా బ్యాటింగ్ లో ఫెయిల్ కావడం, బౌలింగ్ లో సక్సెస్ కావడంతో అతడిని బౌలర్ గానే పరిగణించే పరిస్థితి ఉంది. అశ్విన్ రూపంలో నాణ్యమైన ఆల్ రౌండర్ జట్టుకు దొరకడంతో పార్ట్ టైం బౌలర్ లోటు కనపడలేదు.

Also Read : కామెడీ అయిపోతున్న జగన్.. ఎందుకిలా..?

కానీ బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ తో ఆకట్టుకునే ఆటగాడు మాత్రం కనపడటం లేదనే చెప్పాలి. గతంలో సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రైనా, గంగూలి, మోంగియా వంటి వాళ్ళు బౌలింగ్ లో కాస్తో కూస్తో ప్రదర్శన చేసేవారు. కీలక వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆటగాళ్లను తయారు చేయడంలో భారత జట్టు విఫలం అవుతోంది. కెప్టెన్ గిల్.. హెడ్ కోచ్ గంభీర్ ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సేనా దేశాల పర్యటనలలో ఇది అత్యంత కీలక అంశంగానే చెప్పాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్