Monday, October 27, 2025 10:15 PM
Monday, October 27, 2025 10:15 PM
roots

తండ్రీ, కొడుకుల అరెస్టుకు రంగం సిద్ధం..? ఎమ్మార్వోకి మూడింది..?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చేసిన కొన్ని కార్యక్రమాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అక్రమాలు చేసే విషయంలో విజన్ తో ఉండే వైసీపీ నాయకులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకుంటూ ఉంటారు. సహకార బ్యాంకులలో రుణాల విషయంలో వైసీపీ నాయకులు చేసిన తప్పులకు సంబంధించి ప్రస్తుతం విచారణలు జరుగుతున్నాయి. ఇక వైసిపి ఎన్నికల్లో గెలవడానికి ఆడిన డ్రామాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

Also Read : సచివాలయానికి దూరంగా మంత్రులు..? బాబు వార్నింగ్

మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని తన కొడుకుని ఎన్నికల్లో గెలిపించడానికి ఆడిన ఓ డ్రామా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు రోజుల నుంచి దీని గురించి హడావిడి జరుగుతూనే ఉంది. అయితే దీని విషయంలో జిల్లా కలెక్టర్ తో పాటుగా జాయింట్ కలెక్టర్ ఇద్దరు విచారణను వేగవంతం చేశారు. ఎన్నికల్లో పేర్ని కిట్టు ని గెలిపించేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు నాని. మొత్తం పదివేల ఇళ్ల పట్టాలను తయారు చేసే వాటిని నియోజకవర్గంలో పంపిణీ చేశారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే వాటిని ముద్రించి ఇల్లు లేని వారికి జగన్ ఫోటోతో పంపిణీ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

Also Read : ఆ తేదీ కోసమే కూటమి నేతల ఎదురుచూపులు..!

ఇదే కేసులో ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ జైల్లో ఉన్నారు. త్వరలోనే నానితో పాటుగా ఆయన కుమారుడుని కూడా అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నకిలీ ఇళ్ల పట్టాలను చెరువులు, స్మశానాల సర్వే నెంబర్లతో పంపిణీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక విఆర్ఓ ని కూడా సస్పెండ్ చేశారు అధికారులు. బదిలీపై ఎమ్మార్వో వెళ్లే సమయంలో దానిపై ఆయన సంతకాలు చేశారట. కొంతమంది అక్కడ ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఎమ్మార్వో తో పాటుగా పలువురుని అరెస్టు చేసే అవకాశాలు సైతం కనపడుతున్నాయి. దీని నుంచి తప్పించుకునేందుకు నాని పై స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్