Wednesday, May 6, 2026 09:49 PM
Wednesday, May 6, 2026 09:49 PM

180 మీటర్లకే ఓలా బుక్ చేసుకున్న యువతి.. కారణం తెలిస్తే షాక్

వీధి కుక్కల విషయంలో జనాలకు తెలియని భయం ఉంటుంది. కొన్ని చోట్ల జరిగిన ఘటనలతో వీధి కుక్కలను చూస్తేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నారులు మహిళల విషయంలో అవి క్రూరంగా వ్యవహరించడం ఈ మధ్యకాలంలో మనం వీడియోలు చూస్తూనే ఉన్నాం. పలువురు చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వీటి విషయంలో ఘటన జరిగిన కొన్ని రోజులపాటు మీడియాతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హడావుడి చేస్తూ ఉంటుంది.

Also Read : చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

వీధి కుక్కల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తామని ప్రభుత్వం అధికారిక ప్రకటనలు కూడా జారీ చేస్తూ ఉంటుంది. ఆ ప్రకటన కొద్ది రోజులకు మాత్రమే పరిమితం అయిపోతుంది. వాటి జనాభా రోజురోజుకు పెరిగిపోవడంతో చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్తితులు ఉన్న మాట వాస్తవం. దీనితో రోడ్ల మీదకు వెళ్లాలంటేనే కొన్ని ప్రాంతాల్లో భయపడిపోతున్నారు. పదుల సంఖ్యలో కుక్కలు ఉండటం అవి ఎప్పుడు దాడి చేస్తాయో అర్థం కాని పరిస్థితి ఉండటంతో వాహనదారులు కూడా భయపడే పరిస్థితి నెలకొంది.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదు.. రిలీజ్ అప్పుడే

తాజాగా ఓ యువతి వీధి కుక్కలకు భయపడి చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం 180 మీటర్లకు ఓలా బుక్ చేసుకుంది. ఓలా బుక్ చేసుకున్న తర్వాత రైడర్ పికప్ లోకేషన్ కు వచ్చాడు. లొకేషన్ వద్ద ఓటిపి చెప్పి కారు బయలుదేరగానే కేవలం 180 మీటర్లకే చేరుకోవాల్సిన లొకేషన్ ఎండ్ అయిపోయింది. దీనితో రైడర్ ఆశ్చర్యపోయాడు. అంత తక్కువ దూరానికి ఎందుకు బుక్ చేసుకున్నారని అడగగా వీధి కుక్కలు ఉన్నాయని, అవి దాడి చేస్తాయనే భయంతోనే తాను ఓలా బుక్ చేసుకున్నానని ఆ యువతీ సమాధానమిచ్చింది. అయితే అది ఎక్కడ ఏంటి అనేదానిపై వివరాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్