Saturday, September 19, 2026 03:31 PM
Saturday, September 19, 2026 03:31 PM

కరోనా.. శాస్త్రవేత్త సంచలన కామెంట్స్

మూడేళ్ళ క్రితం ప్రపంచాన్ని కంగారు పెట్టిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ విశ్వరూపం చూపించే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో నిపుణులు దీనిపై కీలక ప్రకటన చేసారు. దేశంలో పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతూ వస్తోంది. పలు మరణాలు కూడా ఈ మధ్య కాలంలో నమోదు అయ్యాయి. దీనితో లాక్ డౌన్ అనే ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కూడా ఈ విషయంలో ఆందోళన మొదలైంది. తాజాగా దీనిపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు.

Also Read : క్రికెట్ ప్రపంచం గుర్తించని హీరో.. శశాంక్ సింగ్

భారతదేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున, ప్రస్తుతం మనుగడలో ఉన్న కొత్త వేరియంట్ లు తీవ్ర ముప్పు కాదని ప్రముఖ భారత జీవశాస్త్రవేత్త డాక్టర్ వినీతా బాల్ తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ మాజీ శాస్త్రవేత్తగా పని చేసిన డాక్టర్ బాల్.. వైరస్ కొత్త వేరియంట్ లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ, డెల్టా వంటి మునుపటి వేరియంట్ ల మాదిరిగా.. ప్రమాదకరం కాదని తెలిపారు. ఈరోజు ఉన్న వైరస్ 2021 నాటి వైరస్ కాదన్నారు. నాలుగేళ్ల క్రితం డెల్టా వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపించింది.

Also Read : రంగంలోకి షర్మిల.. వారే టార్గెట్..!

కొత్త రకాలు ఎక్కువగా వ్యాపించేవి అయినప్పటికీ.. వాటి కారణంగా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు అన్నారు. కొత్త వేరియంట్ ఇప్పటికీ వైరస్ లాగా ఉండవచ్చు కాని మనలో రోగ నిరోధక శక్తి పెరిగింది కాబట్టి ఇబ్బంది లేదు అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ గత వారం ఇదే విషయం చెప్పారు. కేసులు వేగంగా వ్యాప్తి చెందడం లేదని కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్