Friday, September 12, 2025 10:52 PM
Friday, September 12, 2025 10:52 PM
roots

సినిమా పరిశ్రమ దారిలోకి వచ్చిందా..?

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు సినిమా పరిశ్రమ.. రాష్ట్రం విషయంలో అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదమే. తెలంగాణాలో ఆస్తులు ఉండటంతో ఏపీలో పెట్టుబడి పెట్టడానికి గాని.. కనీసం సినిమాలు చేయడానికి గాని ముందుకు రాలేదనే చెప్పాలి. సినిమా పరిశ్రమకు చంద్రబాబు సర్కార్ ఎన్ని విధాలుగా ప్రోత్సాహం అందించినా సరే.. ఏపీలో సినిమాలు చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ చుక్కలు చూపించినా సరే సినిమా పెద్దలు జగన్ భజన చేయడం కూడా అప్పట్లో సంచలనం.

Also Read : కవితకు హరీష్ కౌంటర్..!

అయితే ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం కఠినంగా ముందుకు వెళ్లేందుకు సిద్దమైంది. ఇటీవల థియేటర్లను జూన్ ఒకటి నుంచి మూసి వేయాలని నిర్ణయం తీసుకున్న సమయంలో.. ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఓ బహిరంగ లేఖ కూడా సినిమా పరిశ్రమకు రాసారు పవన్. పవన్ కళ్యాణ్ పేశి నుంచి విడుదలైన ఆ లేఖ సంచలనం. టికెట్ ధరల కోసం వచ్చే సినిమా వాళ్లకు పవన్ షాక్ ఇచ్చినట్లు గానే కనపడింది.

Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?

పరిస్థితి ఇలాగే ఉంటే తమకు ఇబ్బందని భావించిన సినిమా పరిశ్రమ పెద్దలలో ఇప్పుడు కంగారు మొదలైంది. విజయవాడ, విశాఖ, తిరుపతిలో సినిమా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి తమ ఆలోచన చెప్పడానికి సినిమా పరిశ్రమ పెద్దలు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో కూడా స్టూడియో నిర్మాణానికి స్థలం అడిగేందుకు సిద్దమవుతున్నారు. విశాఖలో త్వరలోనే ఓ ప్రముఖ నిర్మాత భూమి పూజ చేసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్