Sunday, September 20, 2026 12:31 PM
Sunday, September 20, 2026 12:31 PM

మతం కార్డు.. మలేషియాలో పాక్ డ్రామాలు

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కఠినంగా ముందుకు వెళ్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంద. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది దేశానికి మలేషియా షాక్ ఇచ్చింది. మతం కార్డు వాడినా సరే పాకిస్తాన్ చేసిన అభ్యర్ధన విషయంలో మలేషియా స్పందించలేదు. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ విషయం అంశం గురించి మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సహా తర్వాతి కార్యక్రమాలను రద్దు చేయాలనే పాకిస్తాన్ డిమాండ్ ను మలేషియా పట్టించుకోలేదట.

Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?

పాకిస్తాన్ రాయబార కార్యాలయం మలేషియా ప్రభుత్వ అధికారులను సంప్రదించిన విషయాన్ని జాతీయ మీడియా బయటపెట్టింది. సంజయ్ ఝా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఐఖ్యరాజ్య సమితిలో నిర్వహించిన 10 కార్యక్రమాలను రద్దు చేయాలని పాకిస్తాన్ కోరింది. మనది ఇస్లామిక్ దేశం, మీరు ఇస్లామిక్ దేశం… భారత ప్రతినిధి బృందం మాట వినకండి, మలేషియాలో వారి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోండి అంటూ మలేషియాకు చెప్పగా.. అక్కడి ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసారు.

Also Read : ఆ మంత్రి పదవి రెడ్డి గారికే.. మహానాడుతో బాబు క్లారిటీ..?

మలేషియా ప్రభుత్వం.. తొమ్మిది మంది సభ్యుల భారత ప్రతినిధి బృందానికి 10 ప్రతిపాదిత కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. జేడియూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని మలేషియాకు వెళ్లిన భారత ప్రతినిధి బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్‌లాల్, ప్రదాన్ బారుహ్, హేమంగ్ జోషి, తృణమూల్ కాంగ్రెస్ అభిషేక్ బెనర్జీ, సీపీఎం జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్‌కు చెందిన సల్మాన్ ఖుర్షీద్, ఫ్రాన్స్‌లోని మాజీ భారత రాయబారి మోహన్ కుమార్‌లు ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్