Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

ఆళ్ళకు ముహుర్తం ఖరారు అయిందా..?

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వైసీపీ నాయకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు తామేం చేసినా సరే చెల్లుతుంది అనే భావనలో అప్పట్లో రెచ్చిపోయిన నాయకులకు ఇప్పుడు పోలీసులు.. చట్టాల రుచి చూపిస్తున్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దందాలు చేసిన నాయకులకు రోజురోజుకి చుక్కలు కనపడుతున్నాయి. నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అండతో రెచ్చిపోయిన నాయకులు ఒక్కొక్కరిగా జైలుకు వెళుతున్నారు.

Also Read : వంశీ మరణం.. పేర్ని సంచలన కామెంట్స్

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అగ్ర నాయకులు అందరూ జైలుకు క్యూకడుతున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు మరో నేతపై దృష్టి పెట్టారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారాలపై దృష్టి సారించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేతలతో పాటుగా నోటికి కూడా ఆయన పని చెప్పేవారు. 2019లో నారా లోకేష్ పై విజయం సాధించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎదురు లేకుండా పోయింది.

Also Read : కడప గడపలో కదం తొక్కిన పసుపు జెండా

ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై ఆయన దాడికి కూడా పథక రచన చేశారు. ఈ కేసునీ గత కొన్ని రోజులుగా విచారిస్తున్న పోలీసులు.. తాజాగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడుగా చేర్చారు. ఈ మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీనితో ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇదే కేసులో మరికొంతమందిపై కూడా దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పై కూడా దృష్టి పెట్టవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్