విజయసాయిరెడ్డి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డికి 3 తరాల బంధం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2. జగన్ చేసిన అన్ని పాపాల్లో సాయిరెడ్డికి భాగస్వామ్యం ఉంది కూడా. అందుకే బాబాయ్ హత్య కేసును గుండె పోటు అని ముందుగా చెప్పింది కూడా సాయిరెడ్డి. ఆ తర్వాత ఫోటోలు బయటకు రావడంతో మాట మార్చేసి అది గొడ్డలి పోటు అని.. చంద్రబాబు హత్య చేయించాడంటూ కథలు చెప్పారు. ఇక జగన్ జైలులో ఉన్న సమయంలో వైఎస్ కుటుంబ లావాదేవీలన్నీ సాయిరెడ్డి ఆధ్వర్యంలోనే నడిచాయి. సాక్షి మీడియా, భారతీ సిమెంట్, సండూర్ పవర్.. ఇలా ఒకటేమిటి.. అన్ని వ్యాపారాల్లోకి పెట్టుబడులు భారీగా రావడానికి.. రాత్రికి రాత్రి షేర్ విలువ పెరగడం కూడా సాయిరెడ్డి మాయే.
Also Read : పవన్ ప్లానింగ్ అదుర్స్.. త్వరలో మరో కార్యక్రమం
ఇక జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఢిల్లీలో లాబీయింగ్ చేసింది సాయిరెడ్డి మాత్రమే. హేమా హేమీలంతా ఉన్నప్పటికీ.. నాటి కేంద్ర పెద్దలతో వరుస మంతనాలు జరిపి.. చంద్రబాబు ప్రభుత్వంపై లేని పోనీ ఆరోపణలు చేసి.. బీజేపీలోని కొందరు నేతల అండతో టీడీపీ – బీజేపీ బంధం బ్రేక్ అయ్యేందుకు కూడా సాయిరెడ్డి తన వంతు ప్రయత్నాలు చేశారు. వరుసగా రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా సాయిరెడ్డికి జగన్ అవకాశం ఇచ్చారు. ఇక 2019లో ఫలితాలు వెలువడిన వెంటనే.. మామా మనం గెలిచాం అంటూ సాయిరెడ్డిని జగన్ ఆలింగనం చేసుకున్నాడు కూడా. అయితే ఆ తర్వాత నుంచి జగన్ తీరులో మార్పు వచ్చింది. సాయిరెడ్డిని దూరం పెట్డాడు. ఇక ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత సాయిరెడ్డికి కూడా తత్వం భోదపడినట్లుంది.
Also Read : ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు
వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు. అలాగే తన నిర్ణయాన్ని జగన్‌కు కూడా ముందే చెప్పినట్లు వెల్లడించారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఇకపై వ్యవసాయం చేసుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ చుట్టూ ఓ కోటరీ చేరిందని.. అది దాటి బయటకు రాకపోతే.. జగన్ మళ్లీ గెలిచే అవకాశమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో వైసీపీ నేతలంతా టార్గెట్ జగన్ అంటున్నారు. జగన్‌కు సాయిరెడ్డి నమ్మక ద్రోహం చేశారని.. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఇలా తప్పుకోవటం దారుణమని కూడా వ్యాఖ్యానించారు.
Also Read : వైసీపీకి మరో షాక్ సిద్ధం..?
ఇక లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డితో పాటు సాయిరెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారించారు. విచారణ తర్వాత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కు సంబంధించిన రెండు సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారని అడిగారని విజయసాయి తెలిపారు.హైదరాబాద్ లో, విజయవాడలో జరిగిన సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించామని, వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, సజ్జల శ్రీధర్ పాల్గొన్నారని చెప్పానని వెల్లడించారు. మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, రాజ్ కేసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని అన్నారు. అన్ని ప్రశ్నలకు రాజ్ కేసిరెడ్డే సరైన సమాధానాలు చెబుతారని తెలిపారు.
Also Read : మహానాడులో చర్చించే అంశాలేమిటో తెలుసా..?
అయితే ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నరేళ్ల పదవీకాలం ఉన్నా సరే.. చంద్రబాబుకు మేలు చేసేందుకు పదవి వదులుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసీ తన పదవిని అమ్ముకున్న వ్యక్తి అని జగన్ తెలిపారు. అలాంటి వ్యక్తి లిక్కర్ పై చేసే ఆరోపణలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. అసలు సాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఎలాంటి విలువ లేదన్నారు. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని.. తప్పంతా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కూడా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్. మరి చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే.. ఎందుకు విచారించలేదు అనే ప్రశ్నకు మాత్రం.. జగన్ నుంచి నో ఆన్సర్.