Wednesday, August 5, 2026 03:15 AM
Wednesday, August 5, 2026 03:15 AM

జగన్ ఇంటి తలుపు తట్టిన లిక్కర్ స్కామ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఒక్కో కీలక అడుగు వైసీపీ అధిష్టానం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. కీలక వ్యక్తులను ఈ లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేయడంతో తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కాంలో నాటి సిఎం వైఎస్ జగన్ పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణ. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జగన్ పేరే ఎక్కువగా వినపడింది. జగన్ కోసమే తాను ముడుపులు తీసుకున్నాను అంటూ కేసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

Also Read : కూటమి సర్కారుపై జగన్‌ ముఠా మరో కొత్త వ్యూహం..!

ఇక జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిపై గురి పెట్టారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతీ వ్యాపార వ్యవహారాలను చూసే బాలాజీ గోవిందప్పలకు విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి పరిణామాలు వేగంగా మారాయి. వాళ్ళు హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ వేయడం, ఆ తర్వాత వాళ్ళు సుప్రీం కోర్ట్ కు వెళ్ళడం వంటివి జరిగాయి. ఇక సుప్రీం కోర్ట్ కూడా వారిని అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Also Read : మరో ఐఏఎస్ అరెస్టు ఖాయం..!

ఇక నేడు హైకోర్ట్ లో విచారణ జరగగా.. ఈ విచారణలో, కృష్ణ మోహన్ రెడ్డి వాదనలు హైలెట్ అయ్యాయి. తనకు ఏ సంబంధం లేదని ఆయన కోర్ట్ లో వాదించారు. ప్రభుత్వ పెద్దల నిర్ణయమే అని స్పష్టం చేసారు. ఇక కాసేపటి క్రితం తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి.. వారి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అటు సుప్రీం కోర్ట్ ఆదేశాలు కూడా ఉండటంతో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కుంభకోణంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులని అరెస్ట్ చేస్తే.. ఈ కేసు జగన్ గుమ్మం వరకు వెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్