Thursday, May 7, 2026 02:12 AM
Thursday, May 7, 2026 02:12 AM

సైలెంట్ స్ట్రోక్ లు ఇస్తున్న ముంబై

ఐపిఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లలో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. అయితే కెప్టెన్ మారిన తర్వాత మాత్రం ఆ జట్టు అపజయాలు మూటగట్టుకుంటూ వచ్చింది. కెప్టెన్ గా రోహిత్ శర్మను కొనసాగించాలి అనే డిమాండ్ లు వినిపించాయి. మైదానంలో కూడా ముంబై అభిమానులు ఇవే నినాదాలు చేసారు. గత సీజన్ లో కూడా ముంబై పెద్దగా రాణించలేదు. ఈ సీజన్ ప్రారంభంలో కూడా ముంబై జట్టు నుంచి ఊహించిన ఆట తీరు కనపడలేదు. స్టార్ ఆటగాళ్ళు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చారు.

Also Read : రాహుల్ సెలెబ్రేషన్ గూస్ బంప్స్.. మామ సునీల్ శెట్టి ఇంట్రస్టింగ్ కామెంట్స్

మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. అలాంటి ముంబై ఇప్పుడు సైలెంట్ గా స్వింగ్ లోకి వచ్చేసింది. ఊహించని ఆట తీరుతో ప్లే ఆఫ్స్ పై గురి పెట్టేసింది. మొదట్లో ఆఖర్లో నిలిచిన ముంబై జట్టు ఇప్పుడు.. అగ్ర స్థానంలో నిలిచింది. 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు దగ్గరగా ఉంది హార్దిక్ సేన. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రోహిత్ శర్మ మళ్ళీ ఫాంలోకి రావడం ఇటు టీం ఇండియాకు కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?

ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఫాం లోకి వచ్చి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇదే కొనసాగితే మాత్రం ముంబై కప్ గెలవడం పెద్ద విషయం కానే కాదు. సిఎస్కే, సన్ రైజర్స్, కేకేఆర్, రాజస్థాన్ దాదాపుగా టోర్నీ నుంచి వైదోలిగాయి. ఇక ఢిల్లీ, లక్నో, పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై జట్ల మధ్యనే పోటీ కనపడుతోంది. ఈ ఆరు టీంస్ లో నాలుగు జట్లు.. ప్లే ఆఫ్స్ కు వెళతాయి. రేస్ లో లేదనుకున్న ముంబై.. అనూహ్యంగా ప్లే ఆఫ్స్ బరిలో నిలవడం ఈ టోర్నీలో హైలెట్ అంశం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్