Wednesday, August 5, 2026 11:01 AM
Wednesday, August 5, 2026 11:01 AM

దేవినేని ఇంట పెళ్ళిపై గులాబీ పార్టీ సామాజిక వర్గ కక్ష

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆ పార్టీ నాయకులను మించి హడావిడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టిడిపిని విమర్శించే విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభిమానించే విషయంలో వాళ్ళు కాస్త అడ్వాన్స్ గా ఉంటారు. తాజాగా దేవినేని ఉమా కుమారుడు వివాహం విషయంలో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దేవినేని ఉమా కుమారుడికి రెండు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులందరూ విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.

Also Read : అమరావతి గెజిట్ సాధ్యమేనా..?

ఈ విషయాన్ని జీర్ణించుకోలేని భారత రాష్ట్ర సమితిలోని ఓ సామాజిక వర్గ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెళ్లికి ఎలా వెళతారు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. అధికారిక కార్యక్రమాల కంటే పెళ్లిళ్లు రేవంత్ రెడ్డికి ఎక్కువైపోయాయి అంటూ వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం ఆశ్చర్యం కలిగించింది.

Also Read : టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ఇల్లు గుర్తించిన నేషనల్ మీడియా

గతంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన ఘనకార్యాలను మర్చిపోయి.. రేవంత్ రెడ్డి శుభకార్యాలకు హాజరు కావడాన్నీ సీరియస్ గా తీసుకొని ఓ వర్గం వ్యతిరేక ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించింది. గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న సరే కేసీఆర్ కనీసం మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం విద్యార్థుల తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడి వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా ముఖ్య మంత్రి నుంచి జరగలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి శుభకార్యానికి హాజరు కావడాన్నీ సామాజిక వర్గ కోణంలో తీసుకొని.. విమర్శించడం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్