అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇప్పుడు భారత కంపెనీలతో పాటుగా అమెరికా కంపెనీలు కూడా భయపడిపోతున్నాయి. ఆయన పలు దేశాలపై కక్షగట్టి పెద్ద ఎత్తున సుంకాలు విధించడంతో అమెరికా నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇప్పుడు అమెరికా ఉత్పత్తులను నమ్ముకుని వ్యాపారాలు పెట్టుకున్న చాలా కంపెనీలు మూతపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటు భారత ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండటంతో చాలా కంపెనీలు మూతపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : కాకాని పారిపోయారా..? కాపాడుతున్నారా..?
అటు అమెరికాలో కూడా భారతీయ ఉత్పత్తులపై నమ్మకం పెట్టుకున్న అనేక కంపెనీలు ట్రంప్ దెబ్బకు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం ప్రధానంగా ఐటీ కంపెనీల పై పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మొబైల్ ఫోన్ రంగంలో అమెరికా అగ్రగామిగా ఉంది. ఐఫోన్ సహా అనేక ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు వీటిపై సుంకం పెరగడంతో ఐఫోన్ సహా కొన్ని మొబైల్ ఫోన్ల ధరలు దేశంలో భారీగా పెరగనున్నాయి.
Also Read : హేమతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు..!
ఇక భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆటోమొబైల్ పరికరాలపై కూడా పెద్ద ఎత్తున ట్రంప్ సుంకం ప్రభావం పడనుంది. అలాగే ఆహార ఉత్పత్తులపై కూడా భారత కంపెనీలు ఇబ్బంది పడే సూచనలు కనపడుతున్నాయి. భారత్ నుంచి బియ్యంతో పాటుగా పప్పులు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ దెబ్బకు ఆయా కంపెనీలు ధరలు పెంచేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనితో అమెరికాలో నివాసం ఉండే భారతీయుల పరిస్థితి మరింత దిగజారే సూచనలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డర్టీ ఫిఫ్టీన్ అంటూ కొన్ని దేశాలపై ట్రంప్ సర్కార్ కక్ష సాధింపుగా వ్యవహరిస్తోంది.

