Thursday, February 5, 2026 07:14 AM
Thursday, February 5, 2026 07:14 AM

పాజిటివ్ వైబ్రేషన్ కోసం చంద్రబాబు తపన

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహిస్తున్న సాంస్కృతి కార్యక్రమాలు అలాగే క్రీడ కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇలా ప్రతి ఒక్కరూ క్రీడా కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరిస్తున్నారు. తాజాగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమం ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహా చాలామంది ఎమ్మెల్యేలు తమ ప్రతిభతో అలరించారు.

Also Read : పెట్టుబడుల విషయంలో బాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు.. మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టిన పరిస్థితి ఉండేది. ఇక ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలతో.. క్రీడా కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో విధ్వంస వాతావరణం ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు క్రమంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం క్రియేట్ చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది.

Also Read : అసెంబ్లీలో పార్టీ పరువు తీసిన జగన్

దీనికి తోడు ఇటీవల సింగర్ సునీతతో నిర్వహించిన పాటల కార్యక్రమం కూడా బాగా హిట్ అయింది. గతంలో ఇటువంటి కార్యక్రమాలు అమరావతిలో జరిగిన పరిస్థితులు లేవనే చెప్పాలి. పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వాతావరణాన్ని పారిశ్రామిక రంగంలో పంపించే ప్రయత్నం చేస్తుంది. సింగర్స్ ద్వారా పెడుతున్న లైవ్ కన్సర్ట్ లకు మంచి స్పందన రావటమే కాకుండా స్పాన్సర్లు కూడా పెరుగుతున్నారు. అమరావతిలో విస్తరిస్తున్న పలు వ్యాపారాలకు ఈ కార్యక్రమాలు ప్రచారానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విజయవాడలో ఉన్న ప్రముఖ షోరూంలో కూడా ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసేందుకు ముందుకు రావడం కొసమెరుపు. బంగారం షాపులతో పాటుగా బట్టల షాపులు సహాయం పలు మొబైల్ షాపులు స్పాన్సర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్