Wednesday, February 4, 2026 04:20 PM
Wednesday, February 4, 2026 04:20 PM

జగన్‌ను ఆడిస్తున్నది ఎవరూ..?

ఇప్పుడు ప్రతి వైసీపీ నేతలో, కార్యకర్తలో ఉన్న అనుమానం ఇదే.. అసలు జగన్ చుట్టూ చేరిన వాళ్లు ఎవరు..? జగన్‌ను నాయకులకు, కార్యకర్తలకు దూరం చేసింది ఎవరు..? నిన్నటి వరకు జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్‌పై విమర్శలు ఎందుకు చేశారు..? విజయసాయిరెడ్డి చెప్పిన కోటరి ఎవరు..? జగన్‌ రెడ్డి ద్వితీయ శ్రేణి కోటరీ ఎవరు..? అసలు వారి అనుమతి లేనిదే జగన్‌ను కలిసే అవకాశం ఎందుకు రావడం లేదు..? ఇవే ఇప్పుడు సగటు వైసీపీ నేతల్లో ఉన్న అనుమానాలు… ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ తీరుపై పలువురు పార్టీ నేతలు ఇదే తరహా విమర్శలు చేశారు. జగన్‌ను కలవాలంటే కొంతమంది అనుమతి కావాలన్నారు. అసలు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే… ముందుగా వారి అనుమతి తీసుకోవాలని అంతా ఆరోపించారు. అయితే చాలా మంది ఆ కోటరీలో ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని అనుకున్నారు.

Also Read : ఆ పదవికి జగన్ అనర్హుడు..!

వైసీపీ అధినేత జగన్‌ను కలవాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాల్సిందే. వారు చెబితేనే జగన్‌ అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. వారికి దక్షిణ ముట్టచెబితేనే జగన్‌ను కలిసే అవకాశం వస్తుంది.. లేదంటే లేదు. అసలు ఎందుకు వీరికి అంత ప్రాధాన్యత జగన్ ఇస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జగన్ చుట్టూ ఉన్న కోటరీని పక్కన పెట్టకపోతే… భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అలాంటి వారి వల్ల… పార్టీకి కీలక నేతలంతా దూరమయ్యారని.. దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టమే జరుగుతుందని కూడా విజయసాయిరెడ్డి హచ్చరించారు. వాస్తవానికి కోటరీలో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి ఉండేవారని.. వాళ్ల మాట మాత్రమే జగన్ వింటారనేది వైసీపీలో జరుగుతున్న చర్చ.

Also Read : బాబు నిర్ణయంతో ఆ నేతల్లో భయం..!

కానీ వాస్తవం వేరు. సజ్జల, వైవీ, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి చెప్పిన మాటలు జగన్ వినేవారు. అంతే తప్ప… వారే ఫైనల్ కాదు అనేది ఇప్పుడిప్పుడే కార్యకర్తలకు తెలుస్తోంది. పార్టీలో ఇతర అంశాలను మాత్రమే వీళ్లు పరిశీలించే వారు… కిందిస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని జగన్‌కు అందించే వారు. వాటిల్లో నిజానిజాలను జగన్‌కు వివరించే వారు. అయితే జగన్ దగ్గర ద్వితీయ శ్రేణి కోటరీ మరొకటి ఉందని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ద్వితీయ శ్రేమి కోటరీ పలుకుబడి పెరిగిపోయింది. ప్రధానంగా కమ్యునికేషన్ సలహాదారుగా పని చేసిన జీవీడీ కృష్ణమోహన్, జగన్ క్యాంపు కార్యాలయం పీఏగా నియమితులైన కే.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్), వైసీపీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇంఛార్జ్ పూడి శ్రీహరి, సీపీ స్పెషల్ పీఏగా పని చేసిన డా.హరికృష్ణ, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌గా నియమితులైన తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, చిత్తూరు జిల్లా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.

Also Read : వైసీపీ నేతల్లో ఆ భయం.. కూటమికి బలం..!

ఈ ఏడుగురు చెప్పిన మాటలకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి మాటలు వినే.. చాలా మంది ముఖ్య నేతలను జగన్ దూరం చేసుకున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. తాజాగా విజయసాయిరెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్‌లో కోటరీ హవానే నడిచింది అనేది బహిరంగ రహస్యం. చివరికి ప్రజలను కలిసేందుకు కూడా జగన్‌ సుముఖత చూపలేదు. పరదాల మాటునే తిరిగారు. జగన్ ఏం మాట్లాడాలన్నా సరే… పూడి శ్రీహరి, కృష్ణమోహన్ రాసివ్వాల్సిందే అట. చివరికి టికెట్ల కేటాయింపులో కూడా ఈ ఏడుగురే కీలక పాత్ర పోషించారనేది ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా వీరిని పక్కన పెట్టకపోతే వైసీపీకి భవిష్యత్తు లేకుండా పోతుందనే మాట బలంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్