Thursday, May 7, 2026 03:27 AM
Thursday, May 7, 2026 03:27 AM

సినిమాల్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. స్టోరీ లైన్ కూడా చెప్పేశారు…!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ సంచలనం. తెలంగాణాలో ఉంటూ కూడా సమైఖ్య వాదాన్ని వినిపించిన ఏకైక నాయకుడు ఆయనే. ఇక జగ్గారెడ్డి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. తాజాగా ఆయన దీనిపై స్వయంగా ఓ ప్రకటన చేసారు. ఓ కమ్మ వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన కోరడం కూడా సంచలనం అయింది. పార్టీకి – ‘కమ్మ’ సామాజిక వర్గానికి అనుసంధాన కర్తగా జెట్టి కుసుమ కుమార్ ఉన్నారని అదే విషయం అధిష్టానానికి చెబుదామని వచ్చానన్నారు. జెట్టికి ఎమ్మెల్సీ ఇవ్వాలని హైదారాబాద్‌లో పీసీసీ చీఫ్, భట్టి, ఉత్తమ్ కి చెప్పానని పేర్కొన్నారు.

Also Read : చంద్రబాబు సీఎం పదవి.. పవన్ పుణ్యమే..!

ఢిల్లీలో కూడా చెబుతాను అని వారికి చెప్పాను.. కానీ ఢిల్లీలో సమావేశం జరగలేదన్నారు. కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని నేను అడుగుతున్న విషయం సీఎం రేవంత్‌కు తెలుసని అన్నారు. నా నిర్ణయాన్ని గౌరవించలేదని భావించడం లేదని.. ఏ నేతపైనా నేను వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. గెలుపోటములు స్వీకరిస్తాను కాబట్టే నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను అన్నారు. జగ్గారెడ్డి సింపతి రాజకీయనాయకుడు కాదని స్పష్టం చేసారు. నేను పోరాడతా, నాపై సింపతీ చూపడానికి ఇష్టపడనన్నారు.

Also Read : కాంగ్రెస్ లో దొంగలు.. రాహుల్ గాంధీ సంచలనం

రాజకీయాల్లోనూ ఉంటా.. సినిమాల్లోనూ ఉంటాను అంటూ ప్రకటన చేసారు. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరని నా ఒరిజినల్ క్యారక్టర్ సినిమాలో చూస్తారు అంటూ తెలిపిన ఆయన ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తా అని తెలిపారు. పీసీసీ, సీఎంకి చెప్పి సమయం తీసుకుని ఏడాదిపాటు సినిమాలో నటిస్తాను అన్నారు. సినిమా పేరు మీ జగ్గారెడ్డి అని అనౌన్స్ చేసారు. సినిమాలో మాఫియాను ఎదురించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర అన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్