Sunday, March 22, 2026 10:10 AM
Sunday, March 22, 2026 10:10 AM

అమరావతి సమీపంలో మెగా టూరిజం స్పాట్..!

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. ఆ దిశగానే అమరావతిని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో… పుల్లీ ప్లాన్డ్ సిటీగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. అమరావతిలో నవ నగరాల నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు కూడా ఆహ్వానించారు. 2027 జూన్ నాటికి అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. ఆ దిశగానే ప్రభుత్వాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. అమరావతిలో సకల సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేశారు. మెట్రో రైలుతో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం, మలుపులు లేని విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, పార్కులు.. ఇలా అన్ని మౌలిక వసతులు ఉండేలా చూస్తున్నారు.

Also Read : మరోసారి పార్లమెంట్ కు అశోక్ గజపతి రాజు…!

సంపద సృష్టిలో చంద్రబాబు మొదటి ప్రాధాన్యత పర్యాటకం. తొలి నుంచి పర్యాటక రంగానికి చంద్రబాబు పెద్దపీట వేశారు. డబ్బు సమాజంలో రోటేషన్ అవ్వటం వల్ల పలువురికి ఉపాధి కలుగుతుందని.. దీని వల్ల సంపద కూడా వృద్ధి చెందుతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు పర్యాటక స్థలాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్ నగరాన్ని పర్యాటకులకు డిస్టినేషన్‌గా మార్చేశారు. ఇక 2014లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏపీలోని పలు పర్యాటక స్థలాలను అభివృద్ధి చేశారు. పాపికొండలు, కృష్ణా, గోదావరి నదుల సంగమం, టెంపుల్ టూరిజమ్, మారేడుమిల్లి, లంబసింగి వంటి ప్రదేశాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో మరో ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు.

Also Read : లాస్ట్ మ్యాచ్ ఆడేస్తున్న కెప్టెన్…!

ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం అందుబాటులో ఉంది. ఇప్పటికే విశాఖ, కాకినాడ, మంగినపూడి, కొత్తపట్నం, కళింగపట్నం బీచ్‌లను అభివృద్ధి చేశారు. అయితే ఇవన్నీ రాజధాని అమరావతికి వంద కిలోమీటర్లు పైగా దూరంలో ఉన్నవి. రాజధాని సమీపంలోని బాపట్ల బీచ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు చంద్రబాబు సర్కార్ చర్యలు ప్రారంభించింది. అమరావతి వచ్చే విదేశీయులు… సేద తీరేందుకు అనుకూలంగా బాపట్ల బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతికి కేవలం 50 కిలోమీటర్ల లోపే బాపట్ల బీచ్ ఉంది. కాబట్టి… గంటలోపే బాపట్ల చేరుకునేలా రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. అలాగే బాపట్ల బీచ్‌లో పర్యాటకుల కోసం కొత్త రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.40 లక్షలు కేటాయించారు. బీచ్‌లో స్నానం చేసిన వారు బట్టలు మార్చుకునేందుకు గదులు సిద్ధం చేస్తున్నారు. అలాగే మంచినీటి షవర్ కోసం కూడా పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక బీచ్‌లో బోటింగ్ సహా వాటర్ గేమ్స్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి వచ్చే విదేశీయులు, పెట్టుబడి దారులు సేద తీరేందుకు బాపట్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం కూడా వస్తుందనేది చంద్రబాబు ప్లాన్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్