Thursday, February 5, 2026 06:57 AM
Thursday, February 5, 2026 06:57 AM

కోహ్లీ కంటిన్యూ చేస్తాడా..?

సాధారణంగా ఐసీసీ టోర్నీలు అంటే టీమిండియా స్టార్ ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి వచ్చేస్తారు. అప్పటివరకు ప్రభావం చూపించని స్టార్ ఆటగాళ్లు ఐసీసీ టోర్నీ.. అడుగుపెట్టిన తర్వాత మాత్రం దూకుడుగా ఆడతారు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ముందు వరుసలో ఉంటారు. గత కొన్నాళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రధానంగా విఫలమౌతూ వస్తున్నారు. వీళ్లిద్దరిని టీం నుంచి పక్కన పెట్టాలి అనే విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి.

Also Read : ఆ ఇద్దరిలో ఎవరికి ముందు.. ఎవరికి ప్రాధాన్యత..?

ఆస్ట్రేలియా పర్యటనలో వీళ్ళిద్దరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కాస్త పర్వాలేదనిపించారు. దాదాపు ఏడాదికి పైగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరాట్ కోహ్లీ గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫైనల్ మ్యాచ్ లో మాత్రమే కోహ్లీ కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం వీళ్ళిద్దరూ తిరిగి ఫామ్ లోకి వచ్చేసారు. కెప్టెన్ రోహిత్ శర్మ పవర్ ప్లే లో కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read : కోహ్లీ సెంచరీ అడ్డుకునే కుట్ర జరిగిందా…?

మొదటి మ్యాచ్ లో 41 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో 20 పరుగులకే అవుట్ అయినా దూకుడుగా ఆడే క్రమంలోనే వికెట్ పారేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్ లో ఫెయిల్ అయినా రెండో మ్యాచ్ లో మాత్రం సెంచరీ సాధించి రికార్డులు క్రియేట్ చేశాడు. దీనితో రాబోయే మ్యాచ్ లో అతను కీలకంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఏవిధంగా ప్రభావం చూపిస్తాడు అనేది చూడాలి. ఇప్పటికే భారత్ సెమి ఫైనల్లో అడుగుపెట్టడంతో విరాట్ కోహ్లీపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read : జియో ఫేక్ వ్యూస్..? నిజంగా అంత మంది చూసారా…?

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో లెగ్ స్పిన్ విషయంలో విరాట్ కోహ్లీ చాలా జాగ్రత్త పడ్డాడు. గతంలో ఆరు మ్యాచుల్లో ఐదు సార్లు లెగ్ స్పిన్నర్లకు వికెట్ ఇచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో అతని విషయంలో టీం కాస్త కంగారు పడింది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతను లెగ్ స్పిన్నర్ బౌలింగ్ లో కూడా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేయడంతో అభిమానులు అలాగే జట్టు యాజమాన్యం కోహ్లీ పై మళ్లీ నమ్మకం పెంచుకుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్