Wednesday, February 4, 2026 11:48 PM
Wednesday, February 4, 2026 11:48 PM

ఆ విషయంలో అంతా ఫెయిల్..!

9 నెలల కూటమి పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ఇంకా చెప్పాలంటే.. వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పట్టుమని పది నెలలు కూడా పూర్తి కానీ ప్రభుత్వంపై ప్రతిరోజు తమదైన శైలిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏదో ఒక రూపంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే… వీటిని తిప్పి కొట్టడంలో కూటమి ప్రభుత్వ పెద్దలు, పార్టీల నేతలు పూర్తిగా విఫలమయ్యారనేది వాస్తవం. సరైన స్థాయిలో కౌంటర్ రాకపోవడంతో.. వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. దీంతో నిజాలు మరుగున పడి… అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయనేది వాస్తవం.

Also Read : సభలో 11 నిమిషాలు… చివరికి బాయ్‌కాట్..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా 8 నెలలు పూర్తి చేసుకుంది. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడిపిన జగన్ పాలన గురించి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టే.. చివరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో పరువు పోయిందని భావించిన వైసీపీ అగ్రనేతలంతా సైలెంట్ అయిపోయారు. ఇక ఇదే సమయంలో కూటమి నేతలు కూడా వైసీపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కానీ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ నేత, కార్యకర్త గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. అదేమిటంటే… ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసిన వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయనే విషయం మర్చిపోకూడదు. అంటే వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉందనేది వాస్తవం. ఈ విషయం మర్చిపోయిన కూటమి పార్టీల నేతలు.. వైసీపీని లైట్ తీసుకున్నారు. ఒకరిద్దరు నేతలు వైసీపీకి రాజీనామా చేయడంతో… ఇక పార్టీ మూసేసినట్లే అనే ప్రచారం కూడా చేశారు కూటమి నేతలు. అయితే వాస్తవానికి వైసీపీ అనేది ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులాంటింది. సైలెంట్‌గా ఉంటే.. వైలెంట్‌గా దెబ్బ పడుతుందనే విషయం కూటమి నేతలు మర్చిపోయారు.

Also Read : ఏపిలో డయల్ యువర్ సీఎం.. ఎవరికి.. ఎందుకు?

ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఆరు నెలలు కూడా నిండక ముందే వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక విషయంపై ప్రతిరోజు మీడియాలో, ప్రజల్లో చర్చలు పెడుతున్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను బయటకు రాకుండా.. ఆ తప్పులన్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వమే చేస్తుందన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మిర్చి ధర విషయంలో వైసీపీ అదే తీరుగా వ్యవహరించింది. చివరికి జగన్ ధర్నా చేపట్టిన రోజే చంద్రబాబు ఢిల్లీలో రైతుల సమస్యపై చర్చించడాన్ని కూడా వైసీపీ తమ ఖాతాలోనే వేసుకుంది. వాస్తవానికి కనీస మద్దతు ధర జీవో ఇచ్చింది జగన్. ఆ పాత జీవో బయటపెట్టడానికి కూటమి ప్రభుత్వానికి 8 నెలలు సమయం పట్టింది. అది కూడా సరిగ్గా జగన్ ధర్నా చేస్తున్నప్పుడే. ఆ రోజు బయటపెట్టడం వల్ల పెద్దగా దానికి ప్రచారం జరగలేదు.

Also Read : అమరావతి పనులకు ముహూర్తం ఖరారు

ఇక వైసీపీ నేతల అక్రమ అరెస్టులు అంటూ ఆ పార్టీ నేతలు తెగ గోల చేస్తున్నారు. అయితే ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాలను టీడీపీ, జనసేన నేతలు చెప్పుకోవడంలో విఫలమయ్యారు. ఆరోజు జరిగిన అక్రమాలకే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలకు వివరించలేకపోతున్నారు. చివరికి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఏకంగా చంద్రబాబు రెండు పథకాలు అంటూ కొత్త పేర్లు పెట్టారు. చంద్రన్న దగా, చంద్రన్న పగ అంటూ సెటైర్లు వేశారు. దీనికి కౌంటర్ చేయడంలో కూటమి నేతలు పూర్తిగా విఫలమయ్యారనేది వాస్తవం. సోషల్ మీడియాలో కూడా కూటమి సర్కార్‌ను తెగ ట్రోల్ చేస్తున్నా కూడా… ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఏదో తొలినాళ్లలో నాలుగు అరెస్టులతో సరిపెట్టిన సర్కార్… ఇప్పుడు మాత్రం లైట్ తీసుకుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్