Wednesday, February 4, 2026 09:53 PM
Wednesday, February 4, 2026 09:53 PM

సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!

ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారి బలం మొత్తం సోషల్ మీడియాలోనే చూపిస్తోంది. అదే సమయంలో ఏం చేయాలన్నా సరే సోషల్ మీడియా ద్వారానే చేస్తోంది కూడా. ప్రతి ఒక్కరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా యాప్‌ల ద్వారానే పార్టీలకు చెందిన ఏ సమాచారం అయినా సరే ఫోటోలు, వీడియోల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయంతో తొలి నుంచి వైసీపీ నేతలు దూకుడుగానే వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ఫేక్ వీడియాలు, మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ, జనసేన నేతల వ్యక్తిత్వ హననానికి కూడా తెగబడ్డారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు. అయినా సరే… ఇప్పటికీ వైసీపీ మాత్రం తమ పాత విధానాన్నే అవలంభిస్తోంది.

Also Read : పవన్ కు వెయిట్ ఇవ్వడం వెనుక రీజన్ అదేనా…?

నెల రోజుల పాటు లండన్‌లో పర్యటించిన జగన్… రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు. ముందుగా విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. తర్వాత గుంటూరు మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వెంటనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మాజీ ఎంపీ పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుతం ఈ మూడు సందర్భాలకు చెందిన వీడియోలు, ఫోటోలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. జగన్ కాలు బెడితే జన సునామీ అని ఒకరు… జగన్‌ ఫాలోయింగ్ చూస్తే.. కూటమి నేతల్లో ఒణుకు పుడుతోందని మరికొందరు వైసీపీ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పోస్టులకు ఘాటుగా రిప్లైలు రావడంతో… వైసీపీ నేతలకు దిక్కుతోచడం లేదు.

Also Read : అందరూ స్టార్లే.. అఖండ2 పై బోయపాటి బిగ్ స్కెచ్

వాస్తవానికి వైసీపీ మొదటి నుంచి కూడా వాస్తవాల కంటే కూడా కల్పితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. జగన్ పాదయాత్ర మొదలు… అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ఐ ప్యాక్ టీమ్ చెప్పుచేతల్లోనే వైసీపీ నేతలు నడుచుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి డ్రామా, 2024 ఎన్నికల ప్రచారంలో విజయవాడలో గులక రాయి డ్రామాతో ఓట్లు పొందేందుకు ప్లాన్ చేశారు. అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడంతో ఈ సారి పాచిక పారలేదు. అయితే దాదాపు 8 నెలలుగా బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమైన జగన్… అమావాస్యకో, పున్నానికో ఇలా ఏపీలోకి వస్తున్నారు. ఆ సమయంలో స్థానికి నేతలు జనాల్ని బాగానే పోగేస్తున్నారు. దీంతో ఆ వీడియో పోస్ట్ చేసి ఆహా, ఓహో అంటోంది వైసీపీ సోషల్ మీడియా.

Also Read : బాహుబలిలా టీడీపీ సోషల్ మీడియా

ఇప్పుడు ఈ వీడియోలకే సామాన్యులు సైతం ఘాటుగా బదులిస్తున్నారు. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న పార్టీ నేతకు ఎందుకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదో కూడా చెప్పండి అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. మరికొందరైతే సిద్ధం అంటూ సభలు నిర్వహించి… జనాల్ని బస్సుల్లో, లారీల్లో తరలించారు కదా… ఆ జనం ఎందుకు ఓట్లు వేయలేదో ముందు అడిగి తెలుసుకోండి అంటూ మర్యాద పూర్వకంగా సూచిస్తున్నారు. చేసిన తప్పు సరిదిద్దుకోకుండా… ఇలా ఫేకే వీడియోలు పోస్ట్ చేయడం వల్ల… ఈ సారి ఆ సీట్లు కూడా రావేమో చూడండి అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్