Thursday, May 7, 2026 12:33 AM
Thursday, May 7, 2026 12:33 AM

బిజెపి ఆదేశాలు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడం ఈ మధ్య కాస్త సంచలనం అయిందని చెప్పాలి. తిరుపతి లడ్డు వ్యవహారం తర్వాత వారాహి డిక్లరేషన్ ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అటు బిజెపి కూడా పవన్ కళ్యాణ్ ను దక్షిణాది రాష్ట్రాల్లో గట్టిగా వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగత ఇమేజ్ ఉండటం, సనాతన ధర్మాన్ని తీసుకెళ్లే విషయంలో ఆయనకు కాస్త నాలెడ్జ్ ఉండటం, తమ పార్టీ కలిసి వస్తుందని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

Also Read : వైసీపీ ఎంపిలకు జగన్ సంచలన ఆదేశాలు..?

ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ముందు దర్శించుకునే పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మధుర మీనాక్షి అలాగే శ్రీ పరుశురామ స్వామి ఆలయాన్ని, ఆగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయంతో పాటుగా స్వామి మలైయి, తిరుత్తయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు. ఆ తర్వాత కర్ణాటక వెళ్లనున్నారు.

Also Read : రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

కర్ణాటక, తమిళనాడులో రాబోయే రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ ను బిజెపి పెద్దలు రంగంలోకి దించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కేరళలో బిజెపికి పట్టు చాలా తక్కువగా ఉంది. ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ బలంగా కనపడుతుంది. దీనితో దక్షిణాది రాష్ట్రాల్లో బలం పుంజుకునేందుకు బీజేపీ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సహకారం.. తీసుకున్న బిజెపి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్