Sunday, September 27, 2026 11:51 AM
Sunday, September 27, 2026 11:51 AM

24 గంటల ఉపవాసం చేస్తే ఇన్ని లాభాలా..?

ఆరోగ్యానికి ఉపవాసానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అందుకే మన పెద్దలు దైవ కార్యక్రమాల్లో ఉపవాసాలను చేర్చిన మాట వాస్తవం. మరి 24 గంటల పాటు ఉపవాసం ఉంటే జరిగే పరిణామాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. మీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు 24 గంటల ఉపవాసం ఉంటే.. శరీరంలో గణనీయమైన జీవక్రియ మార్పులను ప్రేరేపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందులో ముఖ్యమైనది మీ శరీరం కేలరీలు తీసుకునే అలవాటు మార్చుకుంటుంది. శరీరంలో ఉన్న శక్తిని వినియోగిస్తుంది.

Also Read : ఎగ్ వైట్ మంచిది కాదా..? మరి కోడిగుడ్డు ఎలా తినాలి..?

ఈ పరిణామం కొలెస్ట్రాల్, రక్తంలో షుగర్ లెవెల్స్, జీవక్రియ సహా ఎన్నో అంశాలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా 24 గంటల ఉపవాసం సమయంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ కు సహకరించే గ్లైకోజెనోలిసిస్ ఆహారం లేకుండా లెవెల్స్ మెయింటేన్ చేస్తూనే దాదాపు 167 గ్రాముల గ్లూకోజ్‌ ను సరఫరా చేస్తుంది. మరోవైపు, కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం వల్ల ఉపవాసం ముగిసే సమయానికి ఇన్సులిన్ గణనీయంగా తగ్గుతుంది. తక్కువ కార్బ్/అధిక కొవ్వు ఉన్న పెద్దలలో, అధిక బరువు ఉన్న పెద్దవారిలో, 2-3 గంటల తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ లో మార్పు వస్తుంది.

Also Read : మళ్లీ ఆ రోజే సభకు.. ఆ తర్వాత..!

24 గంటల ఉపవాసం 24 గంటల శక్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. కొవ్వు కరగడం కూడా మొదలవుతూ ఉంటుంది. ఇలా చేస్తూ వెళ్తే.. శరీరంలో కొవ్వు నిల్వలు కరగడం మొదలవుతుంది. అయితే ఇది అందరికీ మంచిది కాదు. 18 ఏళ్లలోపు పిల్లలు, టీనేజర్లకు మంచిది కాదట. గర్భిణీ లేదా తల్లిపాలు ఇస్తున్న మహిళలు. ఇన్సులిన్ తీసుకునే టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపవాసం సురక్షితమని క్లినికల్ ట్రయల్స్ చెప్పినా.. టైప్ I డయాబెటిస్ ఉన్నవారిపై ఎటువంటి అధ్యయనాలు జరగలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్