Saturday, June 27, 2026 05:19 PM
Saturday, June 27, 2026 05:19 PM

ఎగ్ వైట్ మంచిది కాదా..? మరి కోడిగుడ్డు ఎలా తినాలి..?

చాలా మందికి కోడి గుడ్డు తినడం ఇష్టమే అయినా లోపలి పచ్చసొన తినాలంటే మాత్రం భయమే. అసలు అది తినవచ్చా లేదా అనే దానిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఒకసారి చూద్దాం. పోషకాహారం పరంగా చూస్తే గుడ్లు చాలా ముఖ్యం. రిచ్ ప్రోటీన్ ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలకు అద్భుతమైన మూలం కోడి గుడ్డు. అయితే, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే వారికి పచ్చసొన వారి కొలెస్ట్రాల్ లెవెల్ ను పెంచుతుందనే ఆందోళన ఉంటుంది.

Also Read : మారుతిని వదలని రాజా సాబ్..!

గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందనే నమ్మకం కారణంగా చాలామంది తెల్లసొనను మాత్రమే తింటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది అపార్ధం మాత్రమే. వాస్తవానికి తెల్ల సొన కంటే పచ్చ సోనలోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా తెలిపారు. గుండె జబ్బు ఉన్న వారికి పచ్చ సొన కారణంగా ఏ ఇబ్బంది ఉండదు. గుడ్డు నుంచి వచ్చే కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

Also Read : చంద్రబాబుపై.. బీజేపీ ఎమ్మెల్యే కులం దాడి వెనుక..?

ఒకవేళ పెరిగినా సరే అది సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ అవుతుంది. అవి చెడు కొలెస్ట్రాల్‌ ను కూడా కంట్రోల్ చేయడంలో పని చేస్తుంది. కోడి గుడ్డును యధాతధంగా తినడమే మంచి చేస్తుంది. పచ్చ సొన కలవకపోతే గుడ్డు తిన్నా ఉపయోగం ఉండదు అంటూ అలోక్ చోప్రా వివరించారు. వాస్తవానికి, మీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ లో దాదాపు 85% మీరు తినే దానితో సంబంధం లేకుండా కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుందని ఆయన హెచ్చరించారు. గుడ్డు మీద నెపం నెట్టేబదులు.. వ్యక్తిగత అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో భూమన దారుణాలు.....

తిరుపతి నగరంలో వైసీపీ సీనియర్ నేత,...

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

ఏపీ మ్యాప్ తో...

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

పోల్స్