Wednesday, September 23, 2026 02:38 PM
Wednesday, September 23, 2026 02:38 PM

ఎవరీ సూర్యాంష్ శేగ్దే.. నితీష్ స్థానంలో కొత్త ఆల్ రౌండర్..!

ఐర్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో అతను ఎడమ తొడ కండరాలకు గాయమైంది. అనంతరం మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అసౌకర్యం కొనసాగడంతో ప్రస్తుతం కోలుకునేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు.

Also Read : సాయికృష్ణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..!

వైద్యుల పర్యవేక్షణలో దాదాపు నెల రోజుల పాటు పునరావాసం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ రేసులో ముంబైకి చెందిన యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శేగ్దే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2003 జనవరి 23న జన్మించిన సూర్యాంశ్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై జట్టు గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

Also Read : ఉదయం యాసిడ్ రిఫ్లక్స్ వేధిస్తోందా..? పరిష్కారం ఇదే..!

అంతేకాకుండా, ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జట్టు జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ శేగ్దేను ఎంపిక చేసే అంశంపై సెలక్టర్లు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

పోల్స్