Sunday, August 23, 2026 01:38 PM
Sunday, August 23, 2026 01:38 PM

కశిరెడ్డి నోరు విప్పుతాడా..?

ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ అక్రమాల కేసులో సిట్ ఎదుట నేడు విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. గత ప్రభుత్వంలో ఐటి సలహాదారుగా పనిచేసిన కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. లిక్కర్ స్కాం వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. మద్యం కంపెనీల నుంచి వసూళ్ల నెట్వర్క్ లో రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read : జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు 

గత నెల 25వ తేదీన నోటిసులు ఇవ్వగా ఏపీ హై కోర్టును ఆశ్రయించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. నోటీసులు ఇచ్చిన తరువాత విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసిన సిట్.. ఆయనను కూడా విచారణకు పిలిచింది. అయితే మిథున్ రెడ్డి వస్తారా అనే దానిపై క్లారిటీ లేదు.

Also Read : మళ్ళీ మొదలైన మంచు రచ్చ 

విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డికి సైతం ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. మద్యం అమ్మకాల అక్రమాల కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఇటీవల వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు చేసారు. దీనితో కసిరెడ్డి నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంలో సిఐడీ తర్వాత ఈడీ అధికారులు విచారణ జరిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖకు ఎంపీ లావు కృష్ణ దేవరాయలు పలు ఆధారాలు కూడా అందించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ పదవి వర్ల...

వర్ల రామయ్య.. ఎంతో కాలంగా చట్టసభకు...

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు...

APPSC గ్రూప్‌-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలకు...

ఆ పల్లెలు కన్నీరు...

ఒక మహా కార్యం జరగాలంటే.. ఎంతో...

ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు...

స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు జోరందుకున్నాయి....

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

పోల్స్