Saturday, September 19, 2026 07:15 PM
Saturday, September 19, 2026 07:15 PM

యోగాంధ్ర టార్గెట్ అదే.. బాబు రీచ్ అవుతారా..?

2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వేల్యూ పడిపోయిన సంగతి అందరికీ క్లారిటీ ఉంది. అప్పట్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేష్టలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వెనకడుగు వేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని కూడా వేధించడంతో చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఎన్నో కంపెనీలు దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. తెలంగాణ కూడా ఈ విషయంలో లాభ పడిందనే చెప్పాలి.

Also Read : యోగాంధ్ర.. ఏపీ బ్రాండ్.. రికార్డుల మోత..!

దానితోపాటు రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరి కూడా రాష్ట్రానికి శాపంగా మారిన విషయం క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ పెంచేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటంతో రాష్ట్రంలో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి పదేపదే రావడం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇది పారిశ్రామిక అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడుతుందనేది నిపుణుల అభిప్రాయం.

Also Read : విమానాన్ని కూల్చేస్తా.. మహిళా డాక్టర్ ఓవరాక్షన్ కు పోలీసుల ట్రీట్మెంట్

అమరావతి పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి రావడంతో జాతీయ స్థాయిలో అమరావతి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇక ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది. సామాన్య ప్రజల్లో కూడా యోగ గురించి చర్చ జరగడమే కాకుండా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మార్మోగింది. సాగర తీరంలో అద్భుతమైన లోకేషన్ లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇది కూడా పారిశ్రామిక అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్