Wednesday, August 5, 2026 05:26 AM
Wednesday, August 5, 2026 05:26 AM

సిక్కోలు లో వైసీపీ దుకాణం బంద్…!

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందనేది వాస్తవం. ఇప్పటికే అత్యంత నమ్మకస్తులే జగన్‌కు షాక్ ఇచ్చారు. బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, నమ్మినబంటు ఆళ్ల నాని, సామినేని ఉదయభానులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వైసీపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. చిత్తూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క నేత కూడా రాజీనామా చేయలేదు. దీంతో ఆహా సిక్కోలు అండగా ఉందని ఇటీవల జరిగిన జిల్లా నేతలతో జగన్ సంతోషం కూడా వ్యక్తం చేశారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి మాత్రం మేడిపండును తలపిస్తోంది. మేడిపండు చూడ మేలిమై ఉండు… పొట్ట విప్పి చూడ పురుగులుండు… అన్నట్లుగా వైసీపీ పరిస్థితి మారిపోయింది.

Read Also : ఏపీకి కొత్తగా రెండు వందే మెట్రోలు…!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరిపోయాయనేది వాస్తవం. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లా పెద్ద దిక్కు, సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏమయ్యారో తెలియటం లేదు. ఇక ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు నెలకోసారి ప్రెస్ ముందుకు వచ్చి వెళ్లిపోతున్నారు. ఇక ఎన్నికల ముందు వరకు దూకుడుగా వ్యవహరించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. కుటుంబ తగాదాలతో నెల రోజులు పైగా దువ్వాడ పరువు పోయింది. దీంతో టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తొలగించిన జగన్… ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. దీంతో దువ్వాడ పరిస్థితి మరింద దిగజారిపోయింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు, పిరియా సాయిరాజ్ వంటి నేతలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి.

టికెట్ ఆశించి భగపడిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇప్పటికే వైసీపీ రాజీనామా చేశారు. ధర్మాన ప్రసాదరావు కూడా త్వరలో పార్టీ మారుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. జిల్లా పెద్దాయనే పార్టీ మారితే… ఆయనతో ఎంత మంది వెళ్తారో అనే చర్చ కూడా ఇప్పటికే జోరుగా నడుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నేత కరువయ్యాడని పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్